వామ్మో.! ఈయన మామూలోడు కాదు. ఎంత భోజన ప్రియుడైతే మాత్రం.. 3330 ఆర్డర్లు ఇవ్వడమా.? అందునా, ప్రతిరోజూ ఏకంగా 9 ఆర్డర్లు ఇచ్చాడట.! జొమాటో అనే డోర్ డెలివరీ ఫుడ్ యాప్ ఉపయోగించి ఢిల్లీ నివాసి ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఫుడ్ పట్ల ఢిల్లీ నివాసి అంకుర్, తమ సంస్థతో పెంచుకున్న అనుబంధానికి జొమాటో సంస్థ మురిసిపోతోంది.
జొమాటో అతి పెద్ద ఫుడ్ లవర్.. జొమాటో , అంకుర్‌కి తమ పట్ల వున్న ప్రేమను, ప్రత్యేకమైన అభిమానాన్ని గౌరవిస్తూ తమ వార్షిక నివేదికలో ‘అతి పెద్ద ఫుడ్ లవర్’ అని అంకుర్ పేరుని ప్రస్తావించింది. నిజానికి, జొమాటో గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇష్టమైన ఆహారం ఎప్పుడు ఎక్కడ కావాలన్నా జొమాటో ద్వారా తెప్పించుకోవచ్చు. అయితే, జొమాటో విషయమై తరచూ కొన్ని వివాదాలు తెరపైకొస్తూనే వుంటాయి. నాణ్యత విషయమై. అయినాగానీ, ఫుడ్ డెలివరీ యాప్స్ విషయంలో జొమాటోనే అగ్రగామి.