అంగరంగ వైభవంగా పెళ్ళి జరిగింది. పెళ్ళికి ముందు మంచి మంచి మాటలే చెప్పాడు. వైవాహిక జీవితం సజావుగా సాగుతుందనుకుంటే, ఇంతలోనే తన భర్త ‘గే’ అని తెలుసుకుంది. స్వలింగ సంపర్కుడైన తన భర్త, తనను దగ్గరకు రానివ్వకపోవడంపై ఆశ్చర్యపోయింది. విషయం బయటపడిందన్న అక్కసుతో, సదరు శాడిస్టు భర్త.. తన భార్యకు నరకం చూపించడం మొదలు పెట్టాడు.
శారీరక వేధింపులే కాదు, మానసికంగానూ హింస పెట్టాడు. గూబ గుయ్యిమనిపించిన న్యాయస్థానం.. సరైన ఆధారాలు సేకరించిన భార్యతన, స్వలింగ సంపర్కుడైన తన భర్త నిజస్వరూపాన్ని న్యాయస్థానం ముందుంచింది. న్యాయస్థానం ఆ శాడిస్టు భర్త పై మండిపడుతూ, లక్ష రూపాయల్ని వెంటనే చెల్లించాలని ఆదేశించింది. లక్ష రూపాయల తక్షణ సాయంతో పాటుగా, ప్రతినెలా 15 వేలు బాధితురాలికి చెల్లించాల్సిందిగా శాడిస్టు భర్తని ఆదేశించింది. అయితే, సదరు శాడిస్టు భర్త