UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 అజిత్‌ తునివు రన్‌టైమ్‌ ఎంతో తెలిసిపోయింది!

సంక్రాంతి వస్తోంది. ఈ పండుగతోపాటు పెద్ద సినిమాలు కూడా బాక్సాఫీస్‌ దగ్గర తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఈ సంక్రాంతికి టాలీవుడ్, కోలీవుడ్‌ స్టార్‌ హీరోల మధ్య గట్టీ పోటీయే ఉంది. టాలీవుడ్‌ వెటరన్‌ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ నటించిన వాల్తేర్‌ వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలు సంక్రాంతికి రిలీజ్‌ కాబోతున్నాయి. వీటికి తోడు తమిళ సూపర్‌ స్టార్లు అజిత్‌, విజయ్‌ నటించిన తునివు, వారసుడు మూవీలు కూడా సంక్రాంతి బరిలో నిలిచాయి. అజిత్‌ నటించిన తునివు మూవీ జనవరి 11న తమిళంతోపాటు తెలుగులోనూ రిలీజ్‌ కానుంది. తాజాగా అజిత్‌ నటించిన తునివు మూవీ రన్‌టైమ్‌ను మేకర్స్‌ రివీల్‌ చేశారు. ఈ సినిమా రన్‌టైమ్‌ 2 గంటల 23 నిమిషాలుగా ఉంది. తునివు యూఎస్‌ఏ డిస్ట్రిబ్యూటర్‌ అయిన సారెగమా సినిమాస్‌ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది.

ఈ తునివు మూవీ తెలుగులో తెగింపుగా రిలీజ్‌ కాబోతోంది. రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఐవీ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా ఈ మూవీని తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. బోనీ కపూర్‌ ప్రొడ్యూస్‌ చేసిన ఈ మూవీకి హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహించాడు. ఇక సంక్రాంతి బరిలో దళపతి విజయ్‌, అజిత్‌ నిలవడంతో ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్‌ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దీనికితోడు వారసుడు నిర్మాత అయిన దిల్‌ రాజు.. తమిళనాడులో థియేటర్ల కోసం వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తమిళంలో అజిత్‌ కంటే విజయే పెద్ద స్టార్‌ అని దిల్‌ రాజు అన్న విషయం తెలిసిందే. ఇది ఇద్దరు హీరోల అభిమానుల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. తమిళంలో తునివు మూవీని సీఎం స్టాలిన్ తనయుడు ఉధయనిధి స్టాలిన్ రిలీజ్ చేస్తున్నాడు. దీంతో పెద్ద సంఖ్యలో థియేటర్లు ఈ సినిమానే ప్రదర్శిస్తున్నాయి. అనూహ్యంగా విజయ్ నటించిన వారిసు మూవీకి థియేటర్ల కొరత ఏర్పడింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం దిల్ రాజు ప్రొడ్యూసర్ కావడంతో మెజార్టీ థియేటర్లు వారసుడుకు దక్కాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !