UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 అవకాశాలు లేక స్కూల్లో అలాంటి పని చేస్తున్న పవన్ హీరోయిన్..!!

దేవయాని.. ఈ పేరు చెబితే ఇప్పటి జనరేషన్ వాళ్లకు ఎవరికి అంతగా గుర్తు రాదు. కానీ మొహం చూస్తే మాత్రం కొంతమంది గుర్తుపడతారు. ఇక అందరికి గుర్తు రావాలంటే పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన సుస్వాగతం సినిమా చూస్తే అందరూ ఓహో ఈ హీరోయినా అంటూ గుర్తుపట్టేస్తారు. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన సుస్వాగతం సినిమాలో దేవయాని హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అంటే ఇష్టం ఉన్నా చదువు కోసం ఇష్టం లేనట్టుగా బిహేవ్ చేస్తూ తండ్రి కి భయపడుతూ ఉంటుంది. ఇక ఈ సినిమాలో ఆమె నటనకు చాలామంది ఫిదా అయ్యారు. ఇక ఆ సినిమా తర్వాత ఈమెకు హీరోయిన్ గా అంతగా అవకాశాలు రాలేదు. తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తమిళ్ ఇండస్ట్రీలో బిజీ అయిపోయింది. కేవలం తెలుగు, తమిళ భాషల్లోనే కాకుండా బెంగాలీ, మలయాళ భాషల్లో కూడా కొన్ని సినిమాలు చేస్తూ అక్కడ కూడా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక దేవయాని (Devayani) అన్ని ఇండస్ట్రీలలో కలిపి దాదాపు 90 కి పైగా సినిమాల్లో అలాగే బుల్లితెర మీద ప్రసారమయ్యే సీరియల్స్ లో కూడా నటించింది. ఇక ఈమె కెరియర్ పిక్స్ లో ఉన్న టైం లోనే డైరెక్టర్ రాజ్ కుమార్ ని ప్రేమించి ఇంట్లో వాళ్లకు చెప్పకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి చేసుకున్నాక వెంట వెంటనే ఇద్దరు పిల్లలు పుట్టడంతో ఫ్యామిలీ లైఫ్ లో బిజీ అవ్వడం వల్ల సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో అవకాశాలు రాకపోవడంతో నిర్మాతగా మారి కొన్ని సినిమాలను తెరకెక్కించింది. కానీ ఆ సినిమాలకు ఆమె పెట్టిన బడ్జెట్ కూడా తిరిగి రాకపోవడంతో ఆర్థికంగా నష్టపోయి కుటుంబాన్ని పోషించడం కోసం ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా కూడా కొన్ని రోజులు ఉద్యోగం చేసింది. ఇక ఆ తర్వాత జనతా గ్యారేజ్, అరవింద సమేత (Aravinda Sametha) వంటి సినిమాల్లో అమ్మ పాత్ర పోషించే అవకాశాలు రావడంతో మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఇండస్ట్రీలో బిజీ అయిపోయింది. ఆ తర్వాత వరుసగా తమిళ్, మలయాళ ఇండస్ట్రీలలో కొన్ని సీరియల్స్ లో నటించే అవకాశం కూడా వచ్చింది. దేవయాని (Devayani) తనకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా దానికి ఎదురు నిలబడి చివరికి స్కూల్లో టీచర్ గానైనా చెప్పి తన కుటుంబాన్ని పోషించుకొని ప్రస్తుతం మళ్ళీ ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. అయితే చాలామంది దేవయాని గురించి తెలిసి నమ్మలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ హీరోయిన్ అంత ఇబ్బందికర పరిస్థితులను కూడా ఎదుర్కొందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !