తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. అధికార బీఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికే మరో సారి అధికారాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తెలంగాణలో అధికారం దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గతంతో పోలిస్తే బిజెపి ఇప్పుడు తెలంగాణలో చాలా బలపడిందని.. కాంగ్రెస్ పార్టీ కి ప్రత్యామ్నాయం తామే అన్నట్లుగా మా పార్టీ నిలిచింది బీజేపీ నాయకులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ని ఢీ కొట్టగల సత్తా ఉన్న పార్టీ బిజెపి అన్నట్లు ఆ పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారు.
ఈ సమయంలోనే తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో టిడిపి తో పొత్తు ఉంటుందా క్లారిటీ ఇవ్వాలి అంటూ తాజాగా ఒక కార్యక్రమం సందర్భంగా విజయశాంతి మరియు ఎంపీ అరవింద్ లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని ప్రశ్నించారట. ఆ సందర్భంగా బండి సంజయ్ స్పందిస్తూ తెలంగాణలో టిడిపి తో పొత్తు ఉండదని స్పష్టం చేశాడు. బీజేపీ ఒంటరిగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లుగా బండి సంజయ్ వ్యాఖ్యలను బట్టి అర్థం అవుతోంది. త్వరలో నిజామాబాద్ మరియు వరంగల్ లో టిడిపి భారీ బహిరంగ సభలు నిర్వహించబోతోంది, ఆ సభలకు వచ్చే స్పందనను బట్టి బిజెపి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఇన్ని రోజులు వార్తలు వచ్చాయి. ఈ నేపద్యంలో బండి సంజయ్ పొత్తు ఉండదని క్లారిటీ ఇవ్వడంతో కన్ఫ్యూజన్ కి తెర పడ్డట్లు అయింది.