మృదువైన, జ్యూసీ, టేస్టీ స్నాక్ కావాలనుకుంటే.. మీరు కచ్చితంగా వెల్వెట్ చికెన్ టిక్కా ట్రై చేయవచ్చు. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్. మరి దీనిని ఎలా తయారు చేయాలో.. కావాల్సి పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు * క్రీమ్ – 1 కప్పు * చికెన్ ఫిల్లెట్ – 3 (కట్ చేసినవి) * పెరుగు – 1/2 కప్పు * పచ్చిమిర్చి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్ * అల్లం పేస్ట్ – 1 టేబుల్ స్పూన్ * ధనియా పొడి – 1 టీస్పూన్ * ఉప్పు – రుచికి తగినంత * జీలకర్రపొడి – 1 టీ స్పూన్ * పెప్పర్ – 1/2 టీ స్పూన్ * ఆనియన్ పౌడర్ – 1 టీ స్పూన్ * మైదా పిండి – 1 టీ స్పూన్ స్టఫ్ చేయడానికి.. * క్రీమ్ – 1 టీస్పూన్ * చీజ్ – 1 టేబుల్ స్పూన్ * కొత్తిమీర – కొంచెం (సన్నగా తురిమినది) * పెప్పర్ – 1 టీస్పూన్ * నిమ్మరసం – 1 టీ స్పూన్ * ఉప్పు – రుచికి తగినంత తయారీ విధానం ముందుగా గిన్నె తీసుకుని దానిలో.. క్రీమ్, పెరుగు, ధనియా పొడి, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం ముద్ద, ధనియాల పొడి, ఉప్పు, జీలకర్ర పొడి, ఎండుమిర్చి, వేయించిన మైదా పిండిని వేసి బాగా కలపండి. దీనిలో చికెన్ వేసి బాగా కలిపి 30 నిమిషాలు పక్కన పెట్టేయండి. అనంతరం స్టఫింగ్ పదార్థాలను బాగా కలిపి.. చికెన్లో స్టఫ్ చేయండి. ఇప్పుడు పాన్‌లో కొద్దిగా నూనె వేసి.. అన్ని వైపులా తిప్పుతూ చికెన్ వేయించాలి. అంతే వేడి వేడి స్టఫ్డ్ చికెన్ టిక్కా రెసిపీ రెడీ.