UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 కలెక్టర్లూ గట్టిగా తిట్టాల్సిందే.! వైఎస్ జగన్ భయం

ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి.! ‘ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తిట్టండి.. గట్టిగా తిట్టండి..’ అంటూ కలెక్టర్లను ఉద్దేశించి ఇటీవల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ‘తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తే.. వాటిని కలెక్టర్లు ఖండించాలి.. ఖండించకపోతే తప్పుడు సంకేతాలు వెళతాయి..’ అన్నది పెన్షన్ల వ్యవహారంపై కలెక్టర్లకు ముఖ్యమంత్రి చేసిన సూచన. నిజానికి, ఏ ముఖ్యమంత్రీ లేదా ఏ ప్రధాన మంత్రరి కూడా ఇలా కలెక్టర్లను లేదా ఉన్నతాధికారుల్ని ఆదేశించే పరిస్థితి వుండదు. ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఎవర్నయినా తిట్టడానికి వీల్లేదు. తిట్టడం అనేది నిజానికి.. నేరం.! రాజకీయ నాయకులు తిట్టడం అనేది రాజకీయం. ఉద్యోగస్తులంటే, ప్రజా ధనాన్ని వేతనాలుగా తీసుకునేవారు. వారికి బాధ్యతలుంటాయ్. అంతే తప్ప, ఆవేశకావేశకాలు వుండకూడదు.! మరెలా వైఎస్ జగన్ ‘కలెక్టర్లూ తిట్టండి..’ అని హుకూం జారీ చేసినట్లు.? ఈ విషయమై వైసీపీ వర్గాల్లోనే లోతైన చర్చ

జరుగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక కుప్పలు తెప్పలుగా సలహాదారులను పెట్టుకుంది. ప్రజాధనాన్ని గౌరవ వేతనంగా పొందుతోన్న సలహాదారులు, తమ స్థాయిని మరచి రాజకీయ విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వాళ్ళ వల్ల ఉపయోగమేంటో ఎవరికీ తెలియదు. అంతమంది సలహాదారులు.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ఇంతమంది పనిగట్టుకుని విపక్షాలపైనా, వైసీపీ వ్యతిరేక మీడియా మీదా తిట్ల పురాణం.. బూతుల పురాణం అందుకుంటున్నా.. అది సరిపోవడంలేదు ముఖ్యమంత్రికి. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపైనా నిందారోపణలు చేస్తున్నారు ముఖ్యమంత్రి.. అధికారిక వేదికలపైన. ఇవేవీ బహుశా ముఖ్యమంత్రికి సంతృప్తినిస్తున్నట్లు లేదు. కలెక్టర్లను రంగంలోకి దించాలనుకుంటున్నారు. కలెక్టర్లు గనుక ముఖ్యమంత్రి చెప్పినట్టు తలాడిస్తే, ఆ తర్వాత ఉద్యోగస్థులందరికీ ఇదే బాధ్యతల్ని ముఖ్యమంత్రి అప్పగిస్తారు. ఆ తర్వాత రాష్ట్రం ఇక బూతుల ప్రదేశ్ అయిపోవడం ఖాయం. తన సొంత మీడియా, తన బలం.. బలగం.. ఇవేవీ తమ మీద వస్తున్న వ్యతిరేకతను ఆపలేకపోతున్న దరిమిలా, భయంతో గజగజ వణుకుతున్న వైఎస్ జగన్, తిట్టేందుకోసం బ్యూరోక్రసీని వాడుతున్నారా.? అన్న అనుమానాలైతే సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇదే చర్చ వైసీపీలోనూ అంతర్గతంగా జరిగే పరిస్థితి వచ్చింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !