UPDATES  

 బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పార్టీ ని దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రణాళిక రూపొందిస్తున్నారు. అందులో భాగంగా పక్క రాష్ట్రం ఏపీకి చెందిన పలువురు నేతలను పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఏపీకి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు మరియు మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ ఇంకా పార్థసారథి తదితరులు నేడు కేసీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. కేసీఆర్ వారికి బీఆర్‌ఎస్‌ కండువా కప్పి ప్రగతి భవన్ లో భారత రాష్ట్ర సమితి యొక్క సభ్యత్వం ఇచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఒక రాష్ట్రానికి.. ఒక ప్రాంతానికి పరిమితం కాదని అన్నాడు. దేశం యొక్క అభివృద్ధి కోసం..

దేశం కోసం ప్రారంభించిన పార్టీ అని పేర్కొన్నారు. లక్ష్య శుద్ధి, సంకల్ప శుద్ధి ఉంటే సాధించలేనిది ఏమీ ఉండదని కేసీఆర్ పేర్కొన్నారు. భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ని నియమిస్తున్నట్లుగా కేసీఆర్ ప్రకటించారు. తోట చంద్రశేఖర్ ద్వారా ఏపీలోకి కీలక కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లను భారత రాష్ట్ర సమితికి వేయించవచ్చని ఉద్దేశంతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకొని ఉంటారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో జనసేన తరఫున గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం నుండి తోట చంద్రశేఖర్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !