తెలంగాణ రాష్ట్ర సమితి (భారత్ రాష్ట్ర సమితిగా పేరు మారింది) సీనియర్ నేత, తెలంగాణ మంత్రి తన్నీరు హరీష్ రావు, సిద్దిపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పీఠాధిపతికి 1.792 కిలోల బంగారు కిరీటాన్ని సమర్పించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ విగ్రహ సమర్పణ కార్యక్రమం జరిగింది. ఈ విగ్రహం ఖరీదు కోటి రూపాయల పై మాటే. ఆలయ నిర్వాహకులు కిలో బంగారాన్ని అందించగా, మిగిలిన మొత్తాన్నీ హరీష్ రావు సహా దాతలు అందించారు.
పోటెత్తిన భక్తులు.. కాగా, వైకుంఠ ఏకాదశి పర్వదినాన్న వెంకటేశ్వరస్వామి ని మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచే కాక, పొరుగు జిల్లాల నుంచీ పెద్దయెత్తున భక్తులు ఆలయానికిచేరుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాంతో ఆ ప్రాంతమంతా భక్త జన సంద్రంలా మారిపోయింది. కాగా, తెలంగాణ జీవన్ దాన్ విధానం దేశానికే ఆదర్శనమనిమంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. హైద్రాబాద్‌లోని జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన జీవన్ దాన్ ఆర్గనైజేషన్ అవగాహనా కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.