‘లంకలో పుట్టినోళ్ళంతా రాక్షసులే.. ఆంధ్రలో పుట్టినోళ్ళంతా తెలంగాణ వ్యతిరేకులే.. ఆంధ్రోళ్ళ బిర్యానీ పేడలా వుంటుంది..’ ఇవి మచ్చుకి కొన్ని మాత్రమే. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో కేసీయార్ సహా అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు, ఆంధ్రోళ్ళని పురుగుల కంటే హీనంగా చూశారు. ఇప్పుడు అదే ఆంధ్రోళ్ళ ఓట్లు కావాల్సి వచ్చింది.! భారత్ రాష్ట్ర సమితి పేరుతో జాతీయ స్థాయి రాజకీయం చేసేందుకు గులాబీ బాస్ కేసీయార్, ఆంధ్రోళ్ళను అక్కున చేర్చుకుంటా మంటున్నారు. ఏపీలో కేసీయార్ పర్యటన.. భారత్ రాష్ట్ర సమితి లో చేరేందుకు పలువురు ఏపీ నాయకులు సుముఖంగా వున్నారట.
ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులుగా గతంలో పనిచేసి, వివిధ రాజకీయ పార్టీల్లో కీలక బాధ్యతలు వహించిన తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ తదితరుల్ని గులాబీ బాస్ తనవైపుకు తిప్పుకుంటున్నారు. విజయవాడ లేదా గుంటూరులో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు కేసీయార్. పార్టీ కార్యాలయాన్ని కూడా కేసీయార్ ప్రారంభిస్తారు. మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో తెరవెనుక మంత్రాంగం కేసీయార్ నడిపిస్తున్నారు ఏపీలో. అంతా బాగానే వుందిగానీ, పోలవరం ఎత్తు విషయంలో కేసీయార్ ఏం చెబుతారు.? ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల గొడవు, బకాయిలు వంటివాటిపై ఎలాంటి పరిష్కారం ఆయన చూపిస్తారు.? కేసీయార్‌కి ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి స్వాగతం లభిస్తుంది.? వేచి చూడాల్సిందే మరి.!