ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అంటూ వైకాపా రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈయన గత కొన్నాళ్లుగా సొంత పార్టీ నాయకులపై మరియు అధినేతపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నాడు. జగన్ ప్రభుత్వం పై ఆయన అనేక ఆరోపణలు చేయడంతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీలో ప్రభుత్వ పథకాలు త్వరలో నిలిచిపోయే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు.
ప్రభుత్వ పథకాలకు ఇచ్చేంత డబ్బు రాష్ట్రంలో లేదని అందుకే జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నాడంటూ ఎంపీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చిన జగన్ ఆ మాటను తప్పాడు.. ప్రజలను మోసం చేశాడు అంటూ ఎంపీ ఆరోపించారు. ప్రజల పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డి తన వైఖరి మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నాడు. ముందస్తు ఎన్నికలు కు వెళ్లడం తప్పితే జగన్ కి మరో మార్గం లేదని.. అందుకే ఈ ఏడాది చివర్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ రఘురామ అంటున్నాడు. మరి వైకాపా నాయకులు ఈ రెబల్ ఎంపీ జోష్యంపై ఎలా స్పందిస్తారని చూడాలి.