నటసింహం నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా వీరసింహారెడ్డి సంక్రాంతికి విడుదల కానున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. తమన్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పాటలు మరియు పోస్టర్, వీడియోలు సినిమాపై అంచనాలు పెంచేసాయి. ఈ సినిమాలో కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ పాత్రలో కనిపిస్తున్నాడు. జనవరి 12వ తారీకు “వీరసింహారెడ్డి” రిలీజ్. దీంతో విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేయడం జరిగింది. రిలీజ్ అయిన పాటలు చాలావరకు అభిమానులను ఆకట్టుకోవడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు ట్రైలర్ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
మరోపక్క నాలుగో సాంగ్ రిలీజ్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో అభిమానులకు మేకర్స్ పూనకాలు తెప్పించే మాస్ అప్డేట్ ట్విస్ట్ ఇవ్వడం జరిగింది. విషయంలోకి వెళ్తే రిలీజ్ చేస్తామన్న నాలుగో సాంగ్ కొద్దిరోజుల పాటు వాయిదా వేసి ఈ లోగా థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసే ప్లాన్ అమలు చేయటానికి సిద్ధమయ్యారు. Veera Simha Reddy Mass Update ఈ విషయాన్ని “వీరసింహారెడ్డి” సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండటంతో పాటు ఇంకా వారం రోజులు మాత్రమే టైమ్ ఉండటంతో అభిమానులలో మరింత ఎక్సైట్మెంట్ పెంచటానికి సిద్ధమవుతూ థీయెట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకోవడానికి మేకర్స్ రెడీ అయ్యారు. జనవరి 6వ తారీకు శుక్రవారం ఒంగోలులో “వీరసింహారెడ్డి” ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. ఈ పరిణామాలతో నందమూరి అభిమానులకు సంక్రాంతి పండుగ ముందే వచ్చేసినట్లు పరిస్థితి మారింది.