ఓవైపు ఏపీ అప్పుల కుప్పల్లో ఉంది. రాజధాని కూడా లేకుండా ఆపసోపాలు పడుతోంది. మద్యం ధరాఘాతం.. నిత్యావసరాల మంటతో జనాలు చలికాచుకుంటున్న పరిస్థితి. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో అప్పులు తెచ్చి సంక్షేమం పంచుతూ జగన్ జనాల నెత్తిన మరింత భారం మోపుతున్నాడు. 1వ తేదీ వస్తే చాలు జీతాల కోసం ఉద్యోగులు, పింఛన్ దారులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. ‘అమ్మో ఒకటో తారీఖు’ అనేలా జగన్ సర్కార్ పరిస్థితి ఉంది. AP Govt- Toyota Fortuner Vehicles ఇంతటి విపత్కర అప్పుల కుప్పల్లో జగన్ సర్కార్ పొదుపు మంత్రం పఠించకుండా విలాసాలకు కోట్లు ఖర్చు చేయడమే అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం అత్యంత ఆధునికమైన ఖరీదైన కొత్త 19 టయోటా ఫార్చ్యూనర్ వాహనాలను కొనుగోలు చేసింది.
ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్.డబ్ల్యూ) అధికారులు సోమవారం వీటిని పరీక్షించి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వీటిలో 17 వాహనాలు నలుపు, 2 వాహనాలు తెలుపు రంగులో ఉన్నాయి. వీవీఐపీల భద్రతకు వీలుగా వీటిని బుల్లెట్ ఫ్రూఫ్ గా మార్చడానికి పంపిస్తున్నారు. ఈ వాహనాలు ఎవరి కోసం అన్నది బయటపెట్టకపోవడం అంరదినీ షాక్ కు గురిచేస్తోంది. సీఎం జగన్ కాన్వాయ్ కోసమేనన్న చర్చ సాగుతోంది. జగన్ ఏపీకి సీఎం అయ్యాకనే ఆయన కోసం అప్పుడే ప్రభుత్వం 6 నల్ల రంగు టయోటా ఫార్చ్యూనర్ లను కొన్నది. 2019 జూన్ 17 నుంచి వాటినే వినియోగిస్తున్నారు. వీటికే నాడు రూ.5 కోట్లు వెచ్చించారు. ఇప్పుడు ఏకంగా 19 టయోటా ఫార్య్యూనర్ ల కోసం ఏకంగా 15.77 కోట్లు వెచ్చించడం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. బుల్లెట్ ఫ్రూఫ్ గా మార్చేందుకు లక్షలు తగలేస్తున్నారు. AP Govt- Toyota Fortuner Vehicles ఓవైపు డబ్బులు లేవు.. అప్పులు ఉన్నాయని అంటుంటే.. జగన్ సర్కార్ మాత్రం ఇలా విలాసాలకు ఖర్చు చేయడంపై జనాలు, ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇదేం పద్ధతి అంటూ ఆడిపోసుకుంటున్నాయి.