అహింసా మార్గంలో బ్రిటీష్ వారిని ఎదురించిన నేల మనది. గాంధేయవాదంతో బ్రిటీష్ వారిని తరిమికొట్టిన వారసులం మనం. నాటి బ్రిటీష్ చట్టాలపై పోరాడిన మనం.. ఇప్పుడు అవే చట్టాలను అమలు చేస్తున్న ఏపీ సీఎం జగన్ కూడా పోరాడాల్సిన దుస్థితికి దిగజారాం. బ్రిటీష్ రాజ్యాన్ని ఏపీలోనూ పునరావృతం చేశారు అభినవ బ్రిటీష్ కారుడు సీఎం జగన్. సొంత ప్రజలపైనే, నేతలపై బ్రిటీష్ రూల్ ను ప్రయోగించాడు. మరి ఇది ఏం రాజ్యమో అర్థం కాని పరిస్థితి. British Rule In AP -అసలు ఏంటి ‘బ్రిటీష్ రూల్’..నిబంధనలు ఏమిటి? బ్రిటీష్ వారు భారతీయుల నిరసనలు అణిచివేయడానికి రూపొందించిందే ఈ ‘1861 బ్రిటీష్ పోలీస్ లా’. దీన్ని జగన్ సార్ ఇప్పుడు ఏపీలోని ప్రతిపక్షాలను కంట్రోల్ చేయడానికి ప్రయోగించారు.
పోలీస్ శాఖ బాధ్యతలు, విధులు, అత్యవసర, విచక్షణాధికారాలు గురించి 1861 బ్రిటీష్ పోలీస్ లాలోని 23వ నిబంధన ద్వారా చాలా విషయాలను స్పష్టంగా పొందుపరిచారు. అందులో ఇప్పుడు జగన్ సర్కారు ఒక లైన్ తీసుకుంది. రాష్ట్రంలో రోడ్లపై సభలు, సమావేశాలు పెట్టకూడదని ఆదేశాలిచ్చింది. వాటిని నిషేధిస్తూ ప్రత్యేక జీవో జారీచేసింది. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. కందుకూరు. గుంటూరులో చంద్రబాబు సభల్లో పలువురు ప్రజలు మరణించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం చెబుతున్నా.. విపక్షాలను అణచివేసేందుకేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రజా రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తే విపక్ష నేతల సభలు, సమావేశాలకు పోలీస్ ప్రొటక్షన్ కల్పించవచ్చు కదా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అటువంటిదేమీ లేకుండా బ్రిటీష్ కాలం నాటి పాడుపడిన 1861 పోలీస్ లాను ప్రయోగించడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇదేం బ్రిటీష్ రాజ్యం కాదు కదా? అని ప్రశ్నిస్తున్కనారు.