UPDATES  

 కేసీఆర్ ఇప్పటికైనా ఆంధ్రులకు నిజం చెప్పాలి

వినేవాడు వెర్రివాడు అయితే.. చెప్పేవాడు కల్వకుంట చంద్రశేఖర్ రావు అన్నట్టుంది పరిస్థితి. ఈ పద ప్రయోగాన్ని తెలంగాణలో విపక్ష నేతలు ఎప్పుడో వాడేశారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ విస్తరణ పని మీద ఉన్న కేసీఆర్ జాతీయ వాదం గురించి గొప్పగా లెక్చర్ ఇవ్వడం ప్రారంభించారు. దేశసమగ్రత, ఐక్యత గురించి గొప్పగా మాట్లాడేస్తున్నారు. డ్రీమ్ ప్రాజెక్టులను బయటపెడుతున్నారు. ఆ మధ్యన జూనియర్ ఎన్టీఆర్ సినిమా బాద్ షాలో డ్రీమ్ మిషన్ తరహాలో తన కలల సాకారాన్ని, భవిష్యత్ ఆకాంక్షను వెల్లడిస్తున్నారు. సొ అంతవరకూ బాగానే ఉన్నా.. వివాదాలు, ఉద్వేగాలు, విధ్వంసాలు, దుష్ప్రచారాలు లేని దేశం కావాలంటూ గొప్పగా సెలవిచ్చారు. సామాన్యుడు, చదువురాని వాడు, సమకాలిన అంశాలపై పెద్దగా అవగాహన లేనివారికి ఇవి గొప్పగా అనిపించవచ్చు.. కానీ వీటన్నింటిని చేసి.. దాటుకొని వచ్చిన చరిత్రను కేసీఆర్ మరిచిపోయారు. అసలు అటువంటివి నాకు తెలియవంటున్న రీతిలో సెలవిచ్చారు. బీఆర్ఎస్ లో కి కొంతమంది ఏపీ నేతలు చేరే సమయంలో నిజంనిజాయితీ లేని చాలా మాటలు చెప్పుకొచ్చారు.

kcr వాస్తవానికి ప్రజల్లో విభజన తెచ్చింది ఎవరు? తెలంగాణ రాష్ట్రం కావాలని ఉద్యమించింది ఎవరు? దాని గురించి విధ్వంసాలకు దిగింది ఎవరు? చివరకు దయాది రాష్ట్రంతో పైచేయి సాధించేందుకు వివాదాలు సృష్టించిందెవరు? అన్నది ఇప్పుడు కేసీఆర్ కు ఎదురవుతున్న ప్రశ్న. తెలంగాణ రాష్ట్ర సాధన గురించి పోరాటం చేయడంలో తప్పులేదు. కానీ ఆ పోరాటం వెనుక ఏపీ ప్రజలపై విధ్వేషాలను నింపింది మాత్రం ముమ్మాటికీ కేసీఆరే అటు స్వరాష్ట్రానికి మోసం చేసింది కూడా ఆయనే. బీఆర్ఎస్ డ్రీమ్ ప్రాజెక్టలను చెప్పే క్రమంలో నది జలాల గురించి ప్రస్తావించారు. దేశంలో ఇన్ని కోట్ల భూములున్నాయి. ఇంతే సాగవుతున్నాయి. నదుల నీరు వృథాగా పోతుందని గణాంకాలతో చెప్పుకొచ్చారు. దేశం పట్ల తనకున్న సమగ్ర అవగాహనను బయటపెట్టారు. అంతవరకూ ఓకే కానీ.. వాటిని సద్వినియోగం చేసుకోవడంలో నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఫెయిలైనట్టు చూపారు. బీఆర్ఎస్ వస్తే బంగారు దేశాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు. తెలంగాణను ఇదే మాదిరిగా బంగారు తెలంగాణ చేస్తామని భ్రమ కల్పించారు. ఉద్యమ తెలంగాణను కాస్తా బంగారు తెలంగాణ గా మార్చారు. ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్ గా మార్చారు. అంటే సమాజం అలానే ఉంది కానీ తన పార్టీ మాత్రం ఎదుగుతోందని కేసీఆర్ చెప్పకనే చెప్పారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !