UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 పింఛనుదారులకు నటనలో శిక్షణ

పింఛనుదారులకు నటనలో శిక్షణ ఇప్పిస్తున్నారట అధికారులు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజమండ్రి పర్యటన కోసం అధికారులు పడుతున్న అవస్తలు చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. అధికార వైసీపీ కి చెందిన నేతలు, కార్యకర్తలు.. ఇంకోపక్క అధికారులు.. ఈ విషయంలో కలిసి పనిచేస్తున్న వైనం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించనున్నారు. నాలుగు కిలోమీటర్ల మేర రోడ్ షో జరుగుతుందట. వివిధ జిల్లాల నుంచి సుమారు 1640 మంది పోలీసుల్ని ఇందుకోసం వినియోగిస్తున్నారు.

లబ్దిదారులకు నటనలో శిక్షణ.? పించను లబ్దిదారులు గుండెలు పిండేసేలా ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో చెప్పడానికి అధికారులు నానా తంటాలూ పడుతున్నారు. అధికార వైసీపీ నేతలు, కార్యకర్తలు అధికారులకు ఈ విషయంలో సాయం చేస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, చేనేత అలాగే కల్లుగీత కార్మికులు.. ఇలా వివిధ వర్గాలకు చెందినవారి నుంచి బాగా మాట్లాడగలిగే లబ్దిదారుల నుంచి ఎంపిక చేసి, సోమవారమే వారికి తగిన తర్ఫీదు ఇచ్చారు. సీఎం సభా వేదిక పక్కనే, లబ్దిదారుల కోసం మరో వేదిక ఏర్పాటు చేశారు. సభ ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి వారితో మాట్లాడతారట. ఈ సందర్భంగా లబ్దిదారుల మాటలు ఎమోషనల్‌గా అందరికీ కనెక్ట్ అయ్యేలా వుండాలట. మరోపక్క, ముఖ్యమంత్రి మాట్లాడే స్క్రిప్టు కూడా షరామామూలుగానే ప్రత్యేకంగా రెడీ అయినట్లు తెలుస్తోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !