UPDATES  

NEWS

వినాయక మండపాల విద్యుత్ చార్జీలురూ.50వేలు చెల్లించిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పోలింగ్ స్టేషన్లు ఓటర్ లందరికీ సదుపాయకరంగా ఉండాలి : భద్రాచలం ఆర్డీవో మంగీలాల్ విగ్నేశ్వరుడి దయ అందరిపై ఉండాలి * ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ ప్రజాపంథా పార్టీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ అరెస్ట్ క్రీడా ప్రాంగణం స్థలం కబ్జా ఆదివాసీల స్వయంపాలన ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలి. జీఎంని కలిసిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం అసంగటిత కార్మికుల పక్షాన పోరాడిన యోధుడు, కా,, ముక్తార్ పాషా. కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలి అన్ని దానాల కన్న అన్నదానం గొప్పది

 టీడీపీ అధినేత చంద్రబాబుని పిలిచి మరీ కానుకల పంపిణీ కార్యక్రమం

ఉయ్యూరు శ్రీనివాస్.. ఈ పేరిప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోతోంది. కానీ, వేరే విధంగా.! గుంటూరు జిల్లాలో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దానిక్కారణం ఈ ఉయ్యూరు శ్రీనివాస్ నిర్వాకమే. ఉయ్యూరు ఫౌండేషన్ పేరుతో, చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఒక్కో కానుక ధర దాదాపుగా 400 రూపాయలంటూ చర్చ జరుగుతోంది. ఆ సరుకుల నాణ్యతని చూసి, జనం డిసైడ్ చేసిన రేటు అది. అయితే, అందులో ఏముందో తెలియని జనం అమాయకంగా ఎగబడ్డారు. చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు..

టీడీపీ అధినేత చంద్రబాబుని పిలిచి మరీ కానుకల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. వేలాదిగా జనం తరలి వచ్చారు. చంద్రబాబు ప్రసంగం ముగిసింది.. ఆ తర్వాత కానుకల పంపిణీ కార్యక్రమం మొదలైంది. ఇంతలోనే తొక్కిసలాట. దురదృష్టకర ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఉయ్యూరు శ్రీనివాస్‌ని పోలీసులు అదుపులోకి తీసుకోగా, ఆయన బెయిల్ మీద విడుదలయ్యారు. ఈ ఉయ్యూరు శ్రీనివాస్, నారా లోకేష్ పాదయాత్రకు స్పాన్సర్ అన్న ప్రచారం జరుగుతోందిప్పుడు. త్వరలో ‘యువగళం’ పేరుతో నారా లోకేష్ పాదయాత్ర నిర్వహించనున్న సంగతి తెలిసిందే. నారా లోకేష్ మెప్పు కోసం.. అధినేత చంద్రబాబు మెప్పు కోసం ఉయ్యూరు శ్రీనివాస్ ‘చంద్రన్న కానుకలు’ పంపిణీ పేరుతో ముగ్గుర్ని బలి తీసుకున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !