భారత రాష్ట్ర సమితి పార్టీ ని దేశ వ్యాప్తంగా విస్తరించినందుకు కేసీఆర్ మెల్లగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కొంత మంది నాయకులను బీఆర్ఎస్ లో జాయిన్ చేస్తూ ఏర్పాటు చేసిన మీడియా సమావేశం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లో కేసీఆర్ కి ఒక వర్గం జనాల్లో మంచి అభిప్రాయం ఉంది, కనుక వచ్చే ఎన్నికల్లో మినిమం ప్రభావం బీఆర్ఎస్ చూపించే అవకాశాలు ఉన్నాయంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొత్త పార్టీలో వచ్చినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకంగా ఉన్నవారు చాలా మంది ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతారు. ఆ ఫార్ములా ఏపీలో అమలు అయితే కచ్చితంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపాకు కలిసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వైకాపాకు వ్యతిరేకంగా ఉన్నవారు తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీకి మద్దతుగా నిలిస్తే ఖచ్చితంగా వైకాపాకు నష్టం కలుగుతుంది. కానీ బీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వ వ్యతిరేక వర్గం వారు మద్దతిస్తే తెలుగుదేశం పార్టీ యొక్క మద్దతు బలం పెరిగే పరిస్థితి ఉండదు. అదే జరిగితే మళ్లీ ఏపీలో వైకాపా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం ను కాపాడడానికి ఏపీలో కేసీఆర్ బీఆర్ఎస్ తో పోటీ చేయించబోతున్నాడు అంటూ ఇప్పటికే కొందరు విమర్శలు చేస్తున్నారు. జనసేన పార్టీని ఏపీలో నాశనం చేయడం కోసమే బీఆర్ఎస్ పార్టీ పని చేయబోతుందని ఇటీవలే విజయశాంతి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కనుక ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు దక్కించుకునేందుకు బీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నాలు చేయడం, తద్వారా వైకాపా మరోసారి గెలవడం జరుగుతుంది అని రాజకీయ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. The post