UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 కాఫీ.. చాయ్‌తో కలిపి తాగేయండి ఇలా!

మీరు టీ తాగుతారా? లేక కాఫీ తాగుతారా? ఒక పనిచేయండి, ఈ సాయంత్రానికి కాఫీ-టీలు రెండూ కలిపి తాగేయండి, అదిరిపోతుంది. ఇలా ఎవరైనా తాగుతారా? అని మీకు అనిపించొచ్చు, కానీ ఈ రెసిపీ వరల్డ్ ఫేమస్. ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. హాంగ్‌కాంగ్‌లో యువాన్‌యాంగ్ (yuanyang) అనే రెసిపీ చాలా పాపులర్, అలాగే మలేషియాలోనూ కోపీ చామ్ (Kopi Cham) అనే రెసిపీ కూడా ఉంది. వీటి అర్థం సింపుల్‌గా కాఫీ చాయ్ (Coffee with Tea) అని చెప్పొచ్చు.

టీతో పాటు కాఫీని కలిపి చేయడమే ఈ కాఫీ చాయ్. మీరు కూడా అప్పుడప్పుడు టీలో కాఫీ పొడి వేసుకుని తాగి ఉంటారు, ఇది కూడా అలాంటిదే. అయితే తయారీ విధానం కొద్దిగా వేరే ఉంటుంది. అంతేకాదు దీనిని చల్లచల్లగా ఐస్ కాఫీ చాయ్ లాగా చేయవచ్చు, లేదా వేడివేడిగా హాట్ కాఫీ చాయ్ లాగా కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి, కావలసిన పదార్థాలు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి. ఈసారి మీ ఇంటికి అతిథులు వచ్చినపుడు కాఫీనో, టీనో కాకుండా ఇలా కాఫీ టీని కాక్‌టైల్ చేసి అందించండి. అంతకంటే ముందు కాఫీ చాయ్ రెసిపీ ఈ కింద ఉంది చూడండి. Coffee with Tea Recipe కోసం కావలసినవి 1 టీస్పూన్ టీ పొడి 1/2 టీస్పూన్ కాఫీ పొడి 1 కప్పు పాలు 1 కప్పు నీళ్లు 1/2 టీస్పూన్ చక్కెర ఐస్ (ఐచ్ఛికం) కాఫీ చాయ్ రెసిపీ- తయారీ విధానం ముందుగా నీళ్లు వేడి చేసి, టీ పొడి వేసి స్ట్రాంగ్ బ్లాక్ టీ తయారు చేయండి. ఆపై అందులో పాలు పోసి, ఆపై చక్కెర వేసి 8 నిమిషాలు మరిగించండి. మరో వైపు మరొక కప్పులో కాఫీని మరిగించండి. ఇప్పుడు టీని ఒక కప్పులో వడకట్టి, పైనుంచి వేడి కాఫీ ద్రావణం పోయండి.అంతే, కాఫీ చాయ్ రెడీ.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !