సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదించుకుంది ప్రగతి. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ వివిధ రకాల పాత్రలను చేస్తూ వస్తుంది. ఎక్కువగా హీరో, హీరోయిన్లకు మదర్ క్యారెక్టర్ లు చేసింది. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా గడిపిన ప్రగతి ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపిస్తుంది. తను ప్రతిరోజు జిమ్ములో చేసే వర్క్ అవుట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అయితే చేసిన క్యారెక్టర్స్ ని మళ్లీ మళ్లీ వస్తున్నాయని అందుకే ఎక్కువగా సినిమాలు చేయడం లేదని అంటుంది ప్రగతి. అయితే ఇప్పుడు చాలామంది 40 ఏళ్లు దాటాక కూడా వివాహం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇదంతా ట్రెండ్ అయిపోయింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రగతి తన లైఫ్, కెరీర్ కి సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది.
రెండో పెళ్లి నాకు ఓకే అంటున్న నటి ప్రగతి
ప్రగతి ఎలాగూ సింగిల్ గా ఉంటుంది కాబట్టి ఆమె రెండో పెళ్లి గురించి ఏమనుకుంటుందో అని యాంకర్ రెండో పెళ్లి గురించి అడిగింది. దానికి బదులుగా ప్రగతి పెళ్లి అనే దానికన్నా కంపానియన్ అంటే బెటర్. చాలాసార్లు నాకు ఒక తోడు ఉంటే బాగుండు అని అనిపించింది. అలాగే నాకు ఒక తోడు ఉంటే బాగుంటుంది character artist Pragathi second marriage news అని అనిపించిన నా మెచ్యూరిటీ లెవెల్ కి మ్యాచ్ అయ్యే వారు దొరకాలి కదా, అదిగాక సింగిల్ పర్సన్ దొరకడం అంటే చాలా కష్టం. కానీ రావాలను ఉంటే మాత్రం అది జరుగుతుందని నమ్ముతాను. అయితే నన్ను భరించడం చాలా కష్టం. ఎందుకంటే నేను కొన్ని విషయాలలో పర్టికులర్ గా ఉంటాను. నాకు ఇలాగే కావాలి అలానే ఉండాలి అని ఉంటుంది. నేను యంగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు అడ్జస్ట్ అయ్యేదాన్ని కావచ్చు. ఇప్పుడైతే చాలా కష్టం అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రగతి చేసిన మాటలు బాగా వైరల్ అవుతున్నాయి.