UPDATES  

NEWS

ఘనంగా కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు… భక్తులకు అన్నదానం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పట్ల నల్ల బ్యాడ్జిలతో నిరసన ర్యాలీ : ఏఐటియుసి పోరాట ఫలితమే 32శాతం లాభాలవాటా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య *హరిప్రియ ఫౌండేషన్ ఉచిత వైద్యశాల సేవలు అభినందనీయం మారుమూల గ్రామానికి కరెంటు లైన్ క్లియర్ మామిళ్ళవాయికి త్రీ పేజ్ విద్యుత్ లైన్ మంత్రి కేటీఆర్ మాటలు సరి కాదు తెదేపా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ మణుగూరు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కు 20 కోట్ల రూపాయల నిధుల మంజూరు పలు శుభకార్యాలకు హాజరైన రేగా సుధారాణి మణుగూరు సిఐ బాలాజీ వరప్రసాద్ ఆకస్మిక బదిలి

 స్పాట్ లో ఏడ్చేసిన మహేశ్ బాబు

టాలీవుడ్‌లో కొందరు హీరోలు రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోను సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తను ఎంత సంపాదించాడన్నది కాకుండా సేవలు చేసుకుంటూ వెళుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకోవడమే కాకుండా వేలాది మంది చిన్నారులకు గుండె జబ్బులను నయం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాడు. అంతేకాకుండా పలు సేవా కార్యక్రమాల్లోను ముందు ఉంటున్నారు. మహేష్ లానే ఆయన కుమార్తే సితారా కూడా తండ్రి నుంచి మంచి సేవా గుణాన్ని అంది పుచ్చుకుంది. మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో చేస్తున్న ఈ చిన్నారి.. తాజాగా సరికొత్త పనికి శ్రీకారం చుట్టింది. ఇటీవల మహేష్ ఫౌండేషన్ కు సంబంధించిన వెబ్ సైట్ ప్రారంభం అయ్యింది. తండ్రితో పాటు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న సితార ఇటీవల వెబ్ సైట్ వివరాలను వివరించింది.

స్విట్జర్లాండ్‌లో మహేష్ ఫ్యామిలీ న్యూ ఇయర్‌ వేడుకలను జరుపుకోగా, నూతన సంవత్సం సందర్భంగా సితార మహేష్ వెబ్ సైట్ లాంచింగ్ గురించి చెప్పుకొచ్చింది.. మహేష్ ఫౌండేషన్ ద్వారా చిన్న పిల్లల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పిన సితార తన తండ్రి ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలను మరింత విస్తరించబోతున్నట్లు పేర్కొంది. Mahesh Babu daughter sitara did great job Mahesh Babu : గొప్ప మనసు…!! ఫౌండేషన్ కోసం తన వంతు సాయంగా పాకెట్ మనీని విరాళంగా ఇస్తున్నట్లు సితార చెప్పుకొచ్చింది. అందరూ ఈ ఫౌండేషన్ కు విరాళాలు అందించాలని, “నూతన సంవత్సరంలో మహేష్ ఫౌండేషన్ అధికారిక వెబ్‌సైట్‌ https://maheshbabufoundation.org ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని సితార పేర్కొంది. చిన్న వయస్సు ఉన్న సితార ఇంత పెద్ద ఆలోచన చేయడం పట్ల ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయస్సు ఉన్న నువ్వు దేవతవి అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. కాగా, మహేష్ బాబు నూతన సంవత్సరం సందర్భంగా స్విట్జర్లాండ్‌లో వెకేషన్‌లో ఉండగా, న్యూ ఇయర్ వేడుకలను అక్కడే జరుపుకున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !