UPDATES  

NEWS

టెట్ ఫీజును వెంటనే తగ్గించాలి..200 నుండి రూ. వెయ్యికి పెంచడం అన్యాయం.. మాతృ అభయ పౌండేషన్ ఆధ్వర్యంలో కంప్యూటర్, పరీక్ష సామాగ్రి, ఆట వస్తువులు పంపిణీ… కరకగూడెంలో అగ్రిటెక్ శాఖ ప్రారంభం…అధునాతన పరికరాలతో రైతులు సాగు చేయాలి.. ఈసం వారి ఇలవేల్పు దూలుగొండ తల్లి జాతర ప్రారంభం.. ఘనంగా ప్రారంభమైన లక్ష్మీదేవి జాతర.. మద్యం తాగి వచ్చాడు…. సస్పెండ్ అయ్యాడు.. ఫోన్ పోయింది…. పోలీస్లు పట్టారు..బాధితునికి అందజేసిన సీఐ రాజువర్మ.. మానవత్వం చాటిన మాలమహానాడు…నిరుపేద రోగికి వితరణ చాటడం అభినందనీయం… – డిప్యూటీ తహసీల్దార్, బీరవెల్లి భరణి బాబు. రామకృష్ణ స్వామిజీ ఆధ్వర్యంలో శ్రీ నాగులమ్మ కు ప్రత్యేక అభిషేకాలు… వేలం పాట ముగిసింది…

 నారా లోకేష్ పాదయాత్రకి ఉయ్యూరు శ్రీనివాస్ ఫండింగ్.

ఉయ్యూరు శ్రీనివాస్.. ఈ పేరిప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోతోంది. కానీ, వేరే విధంగా.! గుంటూరు జిల్లాలో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దానిక్కారణం ఈ ఉయ్యూరు శ్రీనివాస్ నిర్వాకమే. ఉయ్యూరు ఫౌండేషన్ పేరుతో, చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఒక్కో కానుక ధర దాదాపుగా 400 రూపాయలంటూ చర్చ జరుగుతోంది. ఆ సరుకుల నాణ్యతని చూసి, జనం డిసైడ్ చేసిన రేటు అది. అయితే, అందులో ఏముందో తెలియని జనం అమాయకంగా ఎగబడ్డారు. చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు.. టీడీపీ అధినేత చంద్రబాబుని పిలిచి మరీ కానుకల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.

వేలాదిగా జనం తరలి వచ్చారు. చంద్రబాబు ప్రసంగం ముగిసింది.. ఆ తర్వాత కానుకల పంపిణీ కార్యక్రమం మొదలైంది. ఇంతలోనే తొక్కిసలాట. దురదృష్టకర ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఉయ్యూరు శ్రీనివాస్‌ని పోలీసులు అదుపులోకి తీసుకోగా, ఆయన బెయిల్ మీద విడుదలయ్యారు. ఈ ఉయ్యూరు శ్రీనివాస్, నారా లోకేష్ పాదయాత్రకు స్పాన్సర్ అన్న ప్రచారం జరుగుతోందిప్పుడు. త్వరలో ‘యువగళం’ పేరుతో నారా లోకేష్ పాదయాత్ర నిర్వహించనున్న సంగతి తెలిసిందే. నారా లోకేష్ మెప్పు కోసం.. అధినేత చంద్రబాబు మెప్పు కోసం ఉయ్యూరు శ్రీనివాస్ ‘చంద్రన్న కానుకలు’ పంపిణీ పేరుతో ముగ్గుర్ని బలి తీసుకున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !