UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 పోషక విలువలతో కూడిన సోయా కిచ్డీ..

కిచ్డీ అనేది మన రోజువారీ ఆహారంలో ఓ రుచికరమైన వంటకం. అయితే దీనిలో మరింత పోషక విలువలను చేర్చుకోవాలంటే మీరు కచ్చితంగా సోయా కిచ్డీని మీ బ్రేక్​ఫాస్ట్​లో కలిపి తీసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీని ఇంట్లో తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. మరి దీనిని ఎలా తయారు చేయాలి.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు * సోయా బీన్స్ – 1 కప్పు (నానబెట్టాలి) * బియ్యం – 1 1/2 కప్పు (నానబెట్టాలి) * పచ్చిమిర్చి – 2 (తరగాలి) * టొమాటో – 2 (తరగాలి) * ఉల్లిపాయ – 1 పెద్దది (తరగాలి) * అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్ *నూనె – 1 టేబుల్ స్పూన్ *

ఉప్పు – రుచికి తగినంత * పసుపు – చిటికెడు * జీలకర్ర – 1 టీస్పూన్ * కొత్తిమీర – 2,3 టేబుల్ స్పూన్ల్ (తాజాది, తరిగినది) * పెరుగు – 1/2 కప్పు * పచ్చి బఠాణీలు – ¼ కప్పు తయారీ విధానం ముందుగా ఓ పెద్ద పాన్ తీసుకుని.. దానిలో నీరు వేసి మరిగించండి. ఇప్పుడు దానిలో సోయా బీన్స్, బియ్యం, టమోటాలు, పచ్చిమిర్చి వేసి ఉడకనివ్వండి. బియ్యం, బీన్స్ మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. అనంతరం ఓ పాన్ తీసుకుని దానిలో నూనె వేసి.. ఉల్లిపాయ, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత దానిలో పసుపు, పెరుగు, రుచికి ఉప్పు, బఠానీలు వేసి కలపాలి. తర్వాత వండిన అన్నం, బీన్స్ వేసి బాగా కలపండి. కనీసం 10 నిముషాల పాటు దానిని బాగా కలపండి. అవసరాన్ని బట్టి నీళ్లు పోసి.. తరిగిన కొత్తిమీర వేయాలి. అంతే వేడి వేడి సోయా కిచ్డీ రెడీ.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !