కూరగాయలుఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు. వాటిలో క్యాబేజీ ఒకటి. దీనిని అనేక వంటకాలను అలంకరించడానికి, కూరలా కూడా ఉపయోగిస్తారు. అయితే ఈ క్యాబేజీలు మార్కెట్లలో అనేక రంగులలో లభిస్తాయి. ఇప్పుడు మనం పచ్చని క్యాబేజీ గురించి తెలుసుకోబోతున్నాము. క్యాబేజీ శాస్త్రీయ నామం బ్రాసికా ఒలేరేసియా. క్యాబేజీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరాన్ని అనేక సమస్యల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉన్నాయి. క్యాబేజీని తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. అంతే కాదు బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. మరి దీనివల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలు ఏమిటంటే.. రోగనిరోధక శక్తి క్యాబేజీలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.
నిజానికి బలమైన రోగనిరోధక శక్తి అనేక కాలానుగుణ ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియ మీరు జీర్ణక్రియ సమస్యతో బాధపడుతుంటే.. క్యాబేజీని ఆహారంలో చేర్చుకోండి. రుచితో పాటు జీర్ణక్రియకు కూడా మంచిదని భావిస్తారు. క్యాబేజీలో ఫైబర్, ఆంథోసైనిన్, పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియ ప్రక్రియను మెరుగ్గా ఉంచడంలో సహాయపడతాయి. బరువు తగ్గడం విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ లక్షణాలు క్యాబేజీలో కనిపిస్తాయి. ఇది తరచుగా ఆకలి నుంచి మిమ్మల్ని రక్షించడానికి పని చేస్తుంది. క్యాబేజీని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా బరువు అదుపులో ఉంటుంది. గుండె క్యాబేజీలోని ఆంథోసైనిన్ పాలీఫెనాల్స్ యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీని కలిగి ఉంటాయి. ఇది కార్డియాక్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మధుమేహం క్యాబేజీ మధుమేహ రోగులకు మేలు చేస్తుంది. క్యాబేజీ సారంలో యాంటీహైపెర్గ్లైసీమిక్ ప్రభావం ఉందని.. ఇది శరీరంలో గ్లూకోస్ టాలరెన్స్‌ని మెరుగుపరచడానికి, ఇన్సులిన్ స్థాయిలను పెంచడానికి పని చేస్తుందని నిపుణులు చెప్తున్నారు.