మానవ శరీరం ఒక సంక్లిష్టమైన వ్యవస్థ, ఒక అధునాతనమైన యంత్రం. ఇది నమ్మశక్యం కాని ఎన్నో రకాల విన్యాసాలు చేయగలదు. అటువంటి శరీరం సరిగ్గా పనిచేయడానికి సరైన ఇంధనం అవసరం. ఆ ఇంధనం మనం రోజూ తీసుకొనే ఆహార, పానీయాల ద్వారా లభిస్తుంది. కేవలం తినడం వల్ల మాత్రమే శరీరం పనిచేయదు, తిన్నది సరిగ్గా జీర్ణమైనప్పుడే శక్తి విడుదల అవుతుంది. జీర్ణక్రియ మీ శరీరానికి విటమిన్లు, ఖనిజాలతో పాటు ప్రోటీన్లు, లిపిడ్లు, కార్బోహైడ్రేట్లను అందిస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే, మీ శరీరంలోని వ్యవస్థలన్నీ సరిగ్గా పనిచేయాలంటే అందుకు పైన పేర్కొన్న పోషకాలన్నీ అవసరం. జీర్ణవ్యవస్థ మాత్రమే పోషకాలను విచ్ఛిన్నం చేసి శక్తిని విడుదల చేస్తుంది, ఆ శక్తిని మీ శరీరం గ్రహించి వివిధ పనులు చేసుకోడానికి అవకాశం ఇస్తుంది. మరి ఇంతటి కీలకమైన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎంతో అవసరం.
-మెరుగైన జీర్ణక్రియకు యోగా ఆసనాలు HT లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రపంచ యోగా సంస్థ వ్యవస్థాపకులు సిద్ధా అక్షర్, జరాఫ్‌షాన్ షిరాజ్ జీర్ణక్రియకు అవసరమయ్యే అద్భుతమైన కొన్ని యోగాసనాల గురించి తెలియజేశారు, మరి అవేమిటో మీరు తెలుసుకొని ప్రతిరోజూ ఆచరించండి. ప్రతి ఆసనాన్ని ఐదు సెట్లు ఆచరించడానికి ప్రయత్నించాలని, అలాగే ఒక్కో ఆసనం 30 సెకన్ల కంటే తక్కువ కాకుండా వేయాలని అభ్యాసకులను వీరు సూచించారు. వజ్రాసనం- Thunderbolt Pose యోగాసనాలలో వజ్రాసనం తిన్న వెంటనే చేయగలిగే ఏకైక భంగిమ. మీరు మీ మోకాళ్లపై మోకరిల్లి, మీ అరచేతులను మీ మోకాళ్లపై ఉంచి, మీ మడమలను కొద్దిగా దూరంగా ఉంచి, మీ కటిని వాటిపై ఉంచండి. మీ వీపు నిటారుగా నిటారుగా ఉంచండి. ముందుకు చూడండి, ఇలా 30 సెకన్ల పాటు ఉండి, రిలాక్స్ అయి మళ్లీ దీనినే పునరావృతం చేస్తూ మొత్తంగా ఐదు సార్లు వేయండి. సుఖాసనం – Happy Pose ఇది చాలా తేలికైన భంగిమ. సుఖాసనం వేయడానికి ఒక ప్రశాంతమైన చోట సౌకర్యంగా ధ్యాన ముద్రలో నిటారుగా కూర్చోవాలి. మీ అరచేతులను మోకాళ్లపై ఉంచండి. మీ ఎడమ కాలును మడిచి కుడి తొడ లోపల పెట్టండి. ఆ తర్వాత, కుడి కాలును మడిచి ఎడమ తొడ లోపలికి పెట్టండి.