UPDATES  

 హిట్‌ 2 ఓటీటీ రిలీజ్ డేట్‌

హిట్‌.. టాలీవుడ్‌లో ఈ సినిమా అనూహ్య విజయం సాధించింది. బాక్సాఫీస్‌తోపాటు ఓటీటీలోనూ తనదైన ముద్ర వేసింది. చాలా రోజుల తర్వాత ఈ మూవీకి సీక్వెల్‌గా హిట్‌ 2 రిలీజైంది. గతేడాది డిసెంబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిట్ సీక్వెల్‌ కూడా ఊహించినట్లే మంచి విజయం సాధించింది. నేచురల్‌ స్టార్‌ నాని ప్రొడ్యూసర్‌గా మారి తీసిన ఈ రెండు సినిమాలు తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. శైలేష్‌ కొలను డైరెక్షన్‌లో ఈ రెండు సినిమాలు తెరకెక్కాయి. ఫస్ట్‌ పార్ట్‌లో విశ్వక్‌ సేన్‌ లీడ్‌ రోల్‌లో కనిపించగా.. సెకండ్‌ పార్ట్‌లో అడివి శేష్‌ కనిపించాడు. హిట్‌ 2 శేష్‌ కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. ఇప్పుడీ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. వచ్చే శుక్రవారం (జనవరి 6) హిట్‌ 2 మూవీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమ్‌ కానుంది.

హిట్‌ మూవీని కూడా ప్రైమ్‌ వీడియోనే సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సెకండ్ పార్ట్‌ హక్కులను కూడా దక్కించుకున్న ఈ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్.. థియేట్రికల్ రిలీజ్‌ అయిన నెల రోజుల తర్వాత ఓటీటీలోకి తీసుకొస్తోంది. హిట్‌ 2లో అడివి శేష్, మీనాక్షి మధ్య కెమెస్ట్రీ బాగా కుదిరిందన్న ప్రశంసలు వచ్చాయి. ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌లో శేష్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించగా.. కొన్ని ఇన్వెస్టిగేషన్‌ సీన్స్‌ ప్రేక్షకులకు మంచి థ్రిల్‌ అందించాయి. డైరెక్టర్‌ శైలేష్‌ కొలను కథను చెప్పిన తీరు చాలా మందిని ఆకట్టుకుంది. ఇప్పటికే ప్రైమ్‌ వీడియోలో హిట్‌ 2 సినిమా అందుబాటులో ఉన్నా.. రూ.129 రెంట్‌ చెల్లించాల్సి ఉంది. అదే జనవరి 6 నుంచి మాత్రం ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడొచ్చు. బాక్సాఫీస్‌ దగ్గర కూడా హిట్‌ 2 ఇటు ఇండియాతోపాటు యూఎస్‌లోనూ మంచి వసూళ్లు రాబట్టింది. ఈ మూవీలో క్లైమ్యాక్స్‌ సీన్‌ ప్రేక్షకులకు అసలైన థ్రిల్‌ను పంచింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !