UPDATES  

NEWS

వినాయక మండపాల విద్యుత్ చార్జీలురూ.50వేలు చెల్లించిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పోలింగ్ స్టేషన్లు ఓటర్ లందరికీ సదుపాయకరంగా ఉండాలి : భద్రాచలం ఆర్డీవో మంగీలాల్ విగ్నేశ్వరుడి దయ అందరిపై ఉండాలి * ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ ప్రజాపంథా పార్టీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ అరెస్ట్ క్రీడా ప్రాంగణం స్థలం కబ్జా ఆదివాసీల స్వయంపాలన ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలి. జీఎంని కలిసిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం అసంగటిత కార్మికుల పక్షాన పోరాడిన యోధుడు, కా,, ముక్తార్ పాషా. కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలి అన్ని దానాల కన్న అన్నదానం గొప్పది

 : తునివు రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేసిన మేకర్స్‌.

సంక్రాంతి సినిమాల పండగ అని అందరికీ తెలుసు. అయితే ఈసారి సంక్రాంతి మాత్రం మరింత స్పెషల్‌. ఈ ఏడాది టాలీవుడ్‌, కోలీవుడ్‌ స్టార్ల మధ్య సంక్రాంతి ఫైట్‌ నడవనుంది. ఇద్దరు టాలీవుడ్‌ బడా హీరోలు, మరో ఇద్దరు కోలీవుడ్‌ స్టార్ల సినిమాలు సంక్రాంతికి రిలీజ్‌ కాబోతున్నాయి. అందులో ఒకటి అజిత్‌ నటించిన తునివు. తెలుగులో తెగింపుగా వస్తోంది. హెచ్‌.వినోద్‌ డైరెక్ట్‌ చేసిన ఈ సినిమా ట్రైలర్‌ ఈ మధ్యే రిలీజైంది. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. విదేశాల్లో ఓ బ్యాంక్‌కు దోచుకునే ముఠాకు లీడర్‌గా అజిత్‌ కనిపించాడు. ఈ ట్రైలర్‌ సినిమాపై మరింత ఆసక్తి రేపింది. అయితే ట్రైలర్‌ సమయంలో రిలీజ్ డేట్‌ను మాత్రం మేకర్స్ అనౌన్స్‌ చేయలేదు. తాజాగా బుధవారం (జనవరి 4) ఈ మూవీ నిర్మాత బోనీ కపూర్ ట్విటర్ ద్వారా డేట్‌ అనౌన్స్‌ చేశాడు. ముందుగా అనుకున్న దాని కంటే ఒక రోజు ముందు అంటే జనవరి 11న తెగింపు రిలీజ్‌ కాబోతోంది. అదే రోజు తమిళంలో తునివుగా రిలీజవనుంది.

జనవరి 12న రిలీజ్‌ అవుతుందని ఇంతకు ముందు భావించారు. అయితే మేకర్స్‌ మొత్తానికి ఈ సస్పెన్స్‌కు తెరదించారు. ఈ సినిమాలో మంజు వారియర్‌ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపిస్తున్నారు. అజయ్‌, సముద్రఖని, జాన్‌ కోకెన్‌, వీరా ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. జీ స్టూడియోస్‌తో కలిసి బోనీ కపూర్‌ ఈ మూవీని నిర్మించారు. తమిళనాడులో విజయ్ వారిసు మూవీతో తునివుకు పోటీ నెలకొంది. అయితే వారిసు జనవరి 12న రిలీజ్‌ కానుండగా.. తునివు ఒక రోజు ముందే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక జనవరి 12న తెలుగులో బాలకృష్ణ నటించిన వీర సింహా రెడ్డి కూడా రిలీజ్‌ కాబోతోంది. 13న చిరంజీవి వాల్తేర్‌ వీరయ్య రానుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈసారి సంక్రాంతికి బడా సినిమాల జాతర ఉండనుంది. వారిసు తెలుగులో వారసుడుగా రాబోతోంది. అయితే ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా.. జయసుధ, ప్రకాశ్‌ రాజ్‌, సుమన్‌లాంటి టాలీవుడ్‌ నటులే ఉన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !