UPDATES  

NEWS

జక్కన్న స్కెచ్… క్షమాపణలు చెప్పే కుటుంబం కాదు నాది : రాహుల్‌ గాంధీ.. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు.. నిర్వహణ ఏర్పాట్లపై ఈ నెల 28వ తేదీన మాక్ డ్రిల్.. హ్యాట్రిక్ పక్కా …..మళ్ళీ కేసీఆర్ సర్కారే… నేషనల్ పంచాయితీ అవార్డు అందుకున్న కాకర్ల గ్రామపంచాయతీ.సర్పంచ్, కార్యదర్శికి పురస్కారాన్ని అందించిన కలెక్టర్ అనుదీప్… ఇల్లందులో మెనూ పాటించని పోస్ట్ మెట్రిక్ వసతిగృహాన్ని పరిశీలించిన ఏటీడీఓ..మెనూ పాటించే విధంగా చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాల డిమాండ్.. శ్రీరామున్నే మభ్యపెట్టిన ఘనత కేసిఆర్….. సంతలకు తెలంగాణ వ్యాపారాలు రావద్దు..  అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటను పరిశీలించిన ఎమ్మెల్యే రాములు నాయక్.ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు హామీ.. మణుగూరు ఏరియాలో పర్యటించిన సింగరేణి ప్రాజెక్ట్,ప్లానింగ్ డైరెక్టర్ జి. వేంకటేశ్వర రెడ్డి..

 అది ఒక్కటి నచ్చితే చాలట.. సమంత

టాలీవుడ్ హీరోయిన్ సమంత తెలుసు కదా. తను ఇప్పుడు ఏకంగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేసే స్థాయికి ఎదిగింది. నిజానికి.. సమంత పెళ్లి అయి విడాకులు తీసుకున్నా తన కెరీర్ మాత్రం పైకి ఎగబాకుతోంది.

దాదాపు 15 ఏళ్ల నుంచి తెలుగులో తను స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. నిజానికి.. తనది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. డబ్బుల కోసం యాడ్స్ లో నటించింది. మోడలింగ్ చేసింది. చివరకు సినిమాల్లోకి వచ్చి స్టార్ డమ్ ను సంపాదించుకుంది సమంత.

అయితే.. సమంత జీవితం ఇన్నేళ్లలో చాలా మలుపులు తిరిగింది. నిజానికి తనకు ఒక హీరోయిన్ గానే కాదు.. సేవలోనూ ముందుంటుంది. ఎన్నో సేవా కార్యక్రమాల్లో తను ఇప్పటి వరకు పాల్గొన్నది. ఇటీవల తనకు ఒక అరుదైన వ్యాధి సోకిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ వ్యాధికి ట్రీట్ మెంట్ తీసుకుంటోంది సమంత. అయితే.. సమంత చేసే ఎన్నో మంచి పనులను, సేవా కార్యక్రమాలను పక్కన పెట్టి.. తను వేసుకునే డ్రెస్సులు, సినిమాల్లో తను చేసే రొమాన్స్ నే జనాలు చూస్తున్నారు. వాటిని చూసి సమంతపై ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు.

తెలుగుతో పాటు తమిళంలోనూ సమంత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. చాలా ఏళ్ల పాటు తను తమిళం, తెలుగు ఇండస్ట్రీలను ఏలింది. టాప్ హీరోలతో నటించింది. అయితే.. సమంత రొమాంటిక్ సీన్లలో నటించడానికి ఏమాత్రం మొహమాట పడదు. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ చూసే ఉంటారు కదా. అందులో తనది చాలా బోల్డ్ క్యారెక్టర్. హాలీవుడ్ లోనూ తను నటించింది. అందులో లెస్బియన్ క్యారెక్టర్ లో నటించింది సమంత. అయితే.. తనకు పాత్ర నచ్చితే అలాంటి క్యారెక్టర్ లో చేయడానికి ఎలాంటి మొహమాటపడదని చాలాసార్లు పలు ఇంటర్వ్యూలలోనూ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !