ఈటీవీలో ప్రసారం అవుతున్న ఢీ డాన్స్ షో కు ప్రస్తుతం కొత్త జడ్జ్ గా శ్రద్దా దాస్ వస్తున్న విషయం తెల్సిందే. గతంలో ప్రియమణి.. ఆనీ మాస్టర్.. పూర్ణ లు జడ్జ్ లుగా వచ్చారు. పూర్ణ తల్లికాబోతున్న నేపథ్యంలో ఆమె పూర్తిగా దూరం అయ్యారు. ఇక ప్రియమణి పారితోషికం విషయంలో ఎక్కువ డిమాండ్ చేస్తుంది అంటూ మల్లెమాల వారు ఆమెను పక్కకు ఉంచారు అంటూ ప్రచారం జరుగుతుంది. ఆ విషయం గురించి పక్కన పెడితే ఇప్పుడు ఆనీ మాస్టర్ కూడా షో కు పూర్తిగా దూరం అయ్యారు. సినిమాలు ఇతర కార్యక్రమాలతో ఆమె బిజీగా ఉంటున్నారట. దాంతో ఇప్పుడు ఢీ డాన్స్ షో లో శ్రద్దా దాస్ ను రంగంలోకి దించారు. డాన్స్ అంటే ఆసక్తి ఉండటంతో పాటు వచ్చిరాని తెలుగు లో ఆమె బాగానే మాట్లాడుతుంది. అందుకే ఆమెకు జడ్జ్ గా అవకాశం ఇచ్చారు అంటూ వార్తలు వస్తున్నాయి.
సినిమాల్లో బిజీగా లేని శ్రద్దా దాస్ కి కచ్చితంగా ఢీ డాన్స్ షో ఆమె కెరీర్ కు కీలకం అవుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. అందుకే పారితోషికం విషయంలో పట్టింపు లేకుండా ఈ అమ్మడు షో ను చేస్తుంది అనేది సమాచారం అందుతోంది. ఢీ వల్ల బయట ఆఫర్లు వస్తాయని కూడా ఆమె ఆశ పడుతుంది అంటున్నారు. Do you know Shraddha Das reward for Dhee Dance Show judge బుల్లి తెర వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఒక్కో షెడ్యూల్ కు శ్రద్దా దాస్ కి లక్ష రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక్క షెడ్యూల్ లో రెండు లేదా మూడు ఎపిసోడ్స్ ను షూట్ చేస్తారు. కనుక ఆమెకు డీసెంట్ రెమ్యూనరేషన్ దక్కుతున్నట్లుగానే భావించవచ్చు అంటూ బుల్లి తెర వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. ఢీ డాన్స్ షో గతంలో మాదిరిగా రేటింగ్ రావడం లేదు అందుకే రెమ్యూనరేషన్ ల విషయంలో షో నిర్వాహకులు కాస్త కట్టింగ్స్ కు పాల్పడుతున్నారట. ఆది మరియు ప్రదీప్ లకు కూడా ఒక మోస్తరు పారితోషికం మాత్రమే ఇస్తున్నారు అనేది ఇడస్ట్రీ వర్గాల టాక్.