టాలీవుడ్‌లో కొన్ని జంటలు సీక్రెట్‌గా ప్రేమాయణం నడుపుతున్న విషయం తెలిసిందే. వారిలో అక్కినేని నాగార్జున మేన కోడలు సుప్రియ – యంగ్ హీరో అడివి శేష్ జంట ఒకటి.వీరి మధ్య ఏదో జరుగుతుంది అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వార్తలకు బలం చేకూరేలా అడివి శేష్ ఆమెతో క్లోజ్ గా మూవ్ అవ్వడం, అలాగే వాళ్ళ ఇంట్లో జరిగిన క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి అడవి శేష్ పాల్గొనడం, ఆ సెలబ్రేషన్స్ లో సుప్రియ పక్కనే అడివి శేష్ కూర్చోవడం చూసి ఇద్దరి మధ్య సమ్ థింగ్ సమ్‌థింగ్ నడుస్తుందనే నిర్ణయానికి వచ్చారు. అడివిశేష్ నటించిన గూఢచారి సినిమాలో అడివి శేష్ సుప్రియ ఒక కీలకపాత్రలో నటించింది. ఇక అప్పటినుండి వీరి మధ్య స్నేహం కొనసాగుతూ వచ్చింది. ఇక వీరి మధ్య స్నేహం ఎక్కువ అవ్వడం వల్ల చాలామంది వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు,లవ్ లో ఉన్నారు అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.. అంతేకాకుండా అడివి శేష్ వాళ్ళ ఇంట్లో సుప్రియని పెళ్లి చేసుకుంటాననే విషయం చెబితే వాళ్ళ నాన్న ముందు అస్సలు ఒప్పుకోలేదట. ఆమె వయసు ఎక్కడ నీ వయసు ఎక్కడ అని అన్నారని కొంత గొడవ కూడా పడ్డారట. Akkineni Amala was the first to react to Adivi Sesh And Supriya love Akkineni Amala : అమల స్పందన..! అయితే అడివి శేష్ ఎలోగలా కష్టపడి వాళ్ల నాన్నని ఒప్పించారట.ఇక వాళ్ళ నాన్న కూడా ఒప్పుకోవడంతో త్వరలో సుప్రియ కి అడివి శేష్ కి పెళ్లి జరగడం ఖాయం అంటున్నారు. అయితే ఈ క్రమంలో అక్కినేని నాగార్జున భార్య అమల కూడా స్పందించినట్టు తెలుస్తుంది. అమల కి అడివి శేష్ అంటే చాలా మంచి అభిప్రాయం ఉంది.. హీరో గా కెరీర్ ఎదుగుతున్న టైమ్ లో ఇప్పుడే పెళ్లి ఎందుకు అని ఆమె హితభోద చేసినట్టు తెలుస్తుంది. ఒక రెండేళ్ళు ఆగి పెళ్లి చేసుకోమన్నారు అని టాక్. మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉందనే దానిపై క్లారిటీ రావలసి ఉంది.