జబర్దస్త్ ప్రారంభం నుండి యాంకర్ గా కొనసాగుతూ వస్తున్న అనసూయ ఆ మధ్య తప్పుకున్న విషయం తెల్సిందే. జబర్దస్త్ కార్యక్రమం యొక్క కొత్త యాంకర్ గా సౌమ్యా రావ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. అనసూయ సినిమాల్లో నటిస్తున్న కారణంగా బిజీగా ఉన్నాను. జబర్దస్త్ కి డేట్లు ఇవ్వలేక పోతున్నాను అంటూ అనసూయ తప్పుకున్న విషయం తెల్సిందే. ఆ సమయంలో రష్మీ గౌతమ్ ను యాంకర్ గా రెండు షో లకు జబర్దస్త్ నిర్వాహకులు చేయించారు. కన్నడ బ్యూటీ సౌమ్యా రావును రంగంలోకి దించిన మల్లెమాల వారు అనుకున్నట్లుగానే సక్సెస్ అయ్యారు. నాలుగు వారాలకు సౌమ్యా రావును మొదట యాంకర్ గా ఒప్పందం చేసుకున్న మల్లెమాల వారు ఆ ఒప్పందంను కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. మరో నాలుగు వారాల పాటు పొడగించారట. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అందరితో చేయించుకున్నట్లుగానే సంవత్సరానికి గాను ఆమెతో ఒప్పందం చేయించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయట.
కేవలం జబర్దస్త్ లో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు మల్లెమాల వారు నిర్వహించే కార్యక్రమాలకు కూడా ఆమె రావాల్సి ఉంటుందని ఆ ఒప్పందం లో క్లీయర్ గా మెన్షన్ చేస్తారని కూడా సమాచారం అందుతోంది.update కన్నడకు చెందిన సౌమ్యా రావు చాలా సీరియల్స్ లో నటించింది. తన మాటలతో మరియు యాక్టివ్ బాడీలాంగ్వేజ్ తో ఈ అమ్మడు భలే ఉందే అనిపించుకుంది. ప్రతి ఒక్కరితో కూడా ప్రశంసలు దక్కించుకుంటుంది. ఆది వల్ల ఈమెకు మరింతగా పాపులారిటీ దక్కింది అనేది ఇండస్ట్రీ వర్గాల మాట. ఇప్పుడు జబర్దస్త్ నుండి ఆది వెళ్లి పోయాడు. అయినా కూడా ఆమె కు మంచి పేరు రావడంతో కంటిన్యూ అవుతుంది. మొదటి షెడ్యూల్ పేమెంట్ తో పోల్చితే సౌమ్యా రావు యొక్క పారితోషికం ఇప్పుడు రెట్టింపు అయ్యింది అని కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి జబర్దస్త్ యొక్క పర్మినెంట్ కొత్త యాంకర్ సౌమ్యా రావు అంటూ బుల్లి తెర వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.