UPDATES  

NEWS

జక్కన్న స్కెచ్… క్షమాపణలు చెప్పే కుటుంబం కాదు నాది : రాహుల్‌ గాంధీ.. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు.. నిర్వహణ ఏర్పాట్లపై ఈ నెల 28వ తేదీన మాక్ డ్రిల్.. హ్యాట్రిక్ పక్కా …..మళ్ళీ కేసీఆర్ సర్కారే… నేషనల్ పంచాయితీ అవార్డు అందుకున్న కాకర్ల గ్రామపంచాయతీ.సర్పంచ్, కార్యదర్శికి పురస్కారాన్ని అందించిన కలెక్టర్ అనుదీప్… ఇల్లందులో మెనూ పాటించని పోస్ట్ మెట్రిక్ వసతిగృహాన్ని పరిశీలించిన ఏటీడీఓ..మెనూ పాటించే విధంగా చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాల డిమాండ్.. శ్రీరామున్నే మభ్యపెట్టిన ఘనత కేసిఆర్….. సంతలకు తెలంగాణ వ్యాపారాలు రావద్దు..  అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటను పరిశీలించిన ఎమ్మెల్యే రాములు నాయక్.ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు హామీ.. మణుగూరు ఏరియాలో పర్యటించిన సింగరేణి ప్రాజెక్ట్,ప్లానింగ్ డైరెక్టర్ జి. వేంకటేశ్వర రెడ్డి..

 ఈ ప్లాన్ తో జగన్ కి మరో ప్లస్..

ఇది 2023. ఇంకో సంవత్సరంనరలో ఏపీలో ఎన్నికలు రానున్నాయి. దాని కోసం ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలు రెడీ అవుతున్నాయి. అందులో భాగంగా టీడీపీ నేత నారా లోకేశ్ కూడా పాదయాత్రకు సిద్ధం అవుతున్నాడు. ఈనెల 27 నుంచే చిత్తూరు జిల్లా కుప్పం నుంచి పాదయాత్రను ప్రారంభించాలని నారా లోకేశ్ డిసైడ్ అయ్యారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వారాహి యాత్ర పేరుతో బస్సు యాత్రను నిర్వహించనున్నారు. అయితే.. రెండు ప్రధాన పార్టీలు ఎన్నికల వేళ ఇలా యాత్రలను ప్రారంభిస్తే అది ఖచ్చితంగా వైసీపీ పార్టీకి మైనస్ అవుతుంది. దీంతో తాజాగా ఏపీలో రోడ్లపై ర్యాలీలు, సమావేశాలు, సభలను నిర్వహించకుండా వాటిని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే.. నేషనల్ హైవేల మీద కానీ.. రాష్ట్ర రహదారుల మీద కానీ, మున్సిపల్, పంచాయితీరాజ్ రోడ్ల మీద కానీ ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించకూడదు.

అయితే.. ఇటీవల కందుకూరు, గుంటూరులో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా.. ఏ పార్టీ కూడా తాజా నిషేధం వల్ల ఏ రోడ్డుపై కూడా సభ పెట్టే అవకాశం ఉండదు. నిజానికి.. రోడ్ల మీద షోలు చేయడం వల్ల.. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. Ys Jagan why nara lokesh and pawan kalyan yatras banned Ys Jagan : కందుకూరు, గుంటూరు ఘటనలే కారణమా? నిర్వహణ లోపాల వల్ల కూడా ప్రజల ప్రాణాలు పోతున్నాయి కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే.. ఏపీ వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నామని ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. పోలీసులు ప్రత్యేక పర్మిషన్ ఇస్తే సభలు నిర్వహించుకోవచ్చు. సభకు ముందే పోలీసులను సంప్రదించి పర్మిషన్ తీసుకోవాలి. సభకు ఎంత మంది వస్తున్నారు. సభ ఉద్దేశం అన్నీ పరిశీలించి పోలీసులే సభకు అనుమతి ఇవ్వాలా వద్దా అని నిర్ణయిస్తారు. అయితే.. ఇదంతా కావాలని ప్రతిపక్షాల పాదయాత్రలను అడ్డుకోవాలని వైసీపీ ప్రభుత్వం చేస్తున్న నిషేధం అంటూ ప్రతిపక్షాలు ఓవైపు గగ్గోలు పెడుతున్నాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !