రాజకీయాల్లో ఆరితేరిన చాణక్యుడిగా పేరుపొందిన చంద్రశేఖర రావు భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో విస్తరించేందుకు మరింత వేగంగా పావులు కదుపుతున్నారు.. మొన్నటికి మొన్న కాపు సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని చేసిన తర్వాత మరింత వేగంగా అడుగులు వేస్తున్నారు..
ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ఒక భారీ సభను, కార్యాలయాన్ని ఏర్పాటు చేసినందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న తనను కలిసిన తోట చంద్రశేఖర్ కు పలు సూచనలు చేశారు.. పనిలో పనిగా భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సిపి లకు చెందిన అసంతృప్త నేతలకు గాలం వేస్తున్నారు.