UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 సూపర్‌ హిట్‌ క్యాష్ ఆపేసి ఈ పిచ్చి షో

ఈటీవీలో సుమ యాంకర్‌ గా వచ్చిన స్టార్‌ మహిళ మరియు క్యాష్ షో లు వరల్డ్ రికార్డులను సృష్టించాయి అనడంలో సందేహం లేదు. ఎన్నో ఏళ్ల పాటు కొనసాగి ఒక చరిత్ర అన్నట్లుగా సాగిన ఈ రెండు షో లు అద్భుతమైన వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకున్నాయి. ఈటీవీ ఈ స్తాయిలో నిలవడానికి కారణం సుమ కార్యక్రమాలు కూడా ఒక కారణం అంటూ విశ్లేషకులు అంటూ ఉంటారు. అంతటి గొప్ప చరిత్ర ఉన్న కార్యక్రమాలు కనిపించకుండా పోయాయి. ఇటీవలే ఈ రెండు షో లను కూడా ఆపేస్తున్నట్లుగా ప్రకటించారు. స్టార్‌ మహిళ ముగిసి చాలా కాలం అయ్యింది… క్యాష్ షో ఈ వారం నుండి రావడం లేదు. క్యాష్ షో ప్రసారం అయ్య శనివారం రాత్రి ఆ సమయంకు ఏ కార్యక్రమం వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ టైమ్‌ స్లాట్ లో సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్న కార్యక్రమే రాబోతున్నట్లుగా ప్రోమో వచ్చింది. సుమ అడ్డ అంటూ ఒక గేమ్‌ షో కమ్‌ టాక్ షో రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

క్యాష్ షో స్థాయిలో ఆ కార్యక్రమం ఉంటుందా అనేది చూడాలి. ఎన్నో అద్భుతమైన ఎపిసోడ్స్ తో వచ్చిన క్యాష్ షో ను సుమ అడ్డ మరిపిస్తుందా అనేది చూడాలి. ఈ సమయంలోనే ఈటీవీ ప్రేక్షకులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. క్యాష్ క్యార్రమం ఒక అద్భుతం.. అలాంటి కార్యక్రమాన్ని నిలిపి వేసి అదే సమయంలో అదే యాంకర్‌ తో సుమ అడ్డ అంటూ తీసుకు రావడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ కామెంట్స్ వస్తున్నాయి. మల్లెమాల వారు ఎందుకు క్యాష్ షో ను ఆపేసి సుమ అడ్డ కార్యక్రమాన్ని తీసుకు వస్తున్నారో క్లారిటీగా చెప్పాల్సిందే అంటూ చాలా మంది డిమాండ్‌ చేస్తున్నారు. ఇన్నాళ్లు అయినా కూడా క్యాష్ షో ను చూసే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది అనడంలో సందేహం లేదు. టీవీల్లో లేదా యూట్యూబ్‌ లో క్యాష్ ను ప్రతి వారం చూసేవారు ఈ వారం షో లేక పోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమ అడ్డ కొన్ని వారాల వరకు క్యాష్ షో గుర్తుకు వస్తూనే ఉండవచ్చు.

   TOP NEWS  

Share :

Don't Miss this News !