UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 తెలంగాణకి కేంద్రం తీపి కబురు.!కంటోన్మెంట్ కష్టాలు తీరనున్నాయ్..!

తెలంగాణ రాష్ట్రానికి.. అందునా, గ్రేటర్ హైద్రాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌కీ.. అదునా, కంటోన్మెంట్ మీదుగా రాకపోకలు సాగించే హైద్రాబాదీలకు కేంద్ర ప్రభుత్వం కొత్త సంవత్సరంలో తీపి కబురు అందించింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో సాధారణ పౌరులు సంచరించేందుకు పరిమితులున్నాయి. కొన్ని చోట్ల అనుమతుల నిరాకరణ జరుగుతుంటుంది. ఆ ప్రాంతంపై పూర్తిగా కేంద్ర రక్షణ శాఖకే పూర్తి హక్కులున్నాయ్ ఇప్పటిదాకా.

పెరుగుతున్న నగర జనాభా.. అదే పెద్ద సమస్య.. నగర జనాభా విపరీతంగా పెరుగుతోంది.. ఈ క్రమం నగరం చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. కంటోన్మెంట్ మీదుగా రాకపోకలు పెరిగాయి. అయితే, తెలంగాణ ప్రభుత్వం ఈ కంటోన్మెంట్ ప్రాంతంలోని రహదార్లను సైతం వెడల్పు చేయలేని పరిస్థితి. ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం కృషి, అందునా తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పదే పదే కేంద్ర ప్రభుత్వానికి, కంటోన్మెంట్ సమస్యపై వివరించడంతో.. కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది.. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి. కమిటీ నెల రోజుల వ్యవధిలోనే కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !