UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 కేసీఆర్‌ కాస్కో…. పోటీకి సై అంటున్న మోదీ

కయ్యానికైనా.. వియ్యానికైనా సమ ఉజ్జీలు ఉంటే చూడ ముచ్చటగా ఉంది. కానీ, పులిని చూసి అడవిలో జంతువులన్నీ భయపడుతున్నాయి కాబట్టి చారలు పెట్టుకుంటే తనను చూసి కూడా జంతువులు భయపడాలని ఒళ్లంతా చారలు పెట్టుకుందట గుంటనక్క. అచ్చం ఇలాగే ఉంది తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీరు. నరేంద్ర మోదీకి కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసే ప్రధాని అయ్యాడు. అపరిమితమైన కీర్తి పొందుతున్నాడు. అన్ని రాష్ట్రాల్లో బీజేపీని గెలిపిస్తున్నాడు. విశ్వగురువుగా కీర్తించబడుతున్నాడు. తాను కూడా ముఖ్యమంత్రిగా చేశాను. ప్రధాని అయ్యే అర్హత నాకు కూడా ఉందనుకున్నాడు కేసీఆర్‌. అర్హత ఉండొచ్చు.. మెరుగైన పాలన అందిచొచ్చు. హిందీ బాగా మాట్లాడొచ్చు. కానీ ఎదుటివారిని గౌరవించే తత్వం ఉండాలి. అది కే సీఆర్‌లో ఏ కోణంలోనూ పించదు.. హోదాతో, పదవితో సంబంధం లేకుండా ప్రత్యర్థి అనుకున్నవాడిని ఏక వచ్చనంతో మాట్లాడం, దూషించడం కేసీఆర్‌ సహజ స్వభావం. అందుకే ఆయన జాతీయ పార్టీ పెట్టినా ఆయనతో కలిసి పనిచేయడానికి దేశంలో ఏ పార్టీ ముందుకు రావడం లేదు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసి ఉండాలి రాజకీయంలో.. కానీ కేసీఆర్‌ ఎజెండా మోదీని గద్దె దించడం ఒక్కటే. Modi vs KCR సమరానికి సై అంటున్న మోదీ.. కరెక్టు మొగుడు దొరికితే ఎంతటి గయ్యాలి అయినా అనిగిమణిగి ఉండాల్సిందే.

తానే రాజయ చతురుడిని అని భావించే కేసీఆర్‌కు కరెక్టు మొగుడు దొరికాడు. ఇన్నాళ్లూ కేసీఆర్‌ విద్యలన్నీ చూస్తూ పిల్లలకాకిపై ఉండేలు దెబ్బ ఎందుకు అన్నట్లు ఊరుకున్న మోదీ సహనానికే కేసీఆర్‌ పరీక్ష పెడుతున్నాడు. దీంతో సమ ఉజ్జీజ కాకపోయినా మోదీ కూడా సమరానికి సై అన్నట్లు తెలుస్తోంది. దక్షినాది పాగా వేయాలని చూస్తున్న కమలనాథులు.. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను గద్దె దించాలని చూస్తున్నారు. ఇందుకు బ్రహ్మాస్త్రమే ప్రయోగించబోతున్నారు. తెలంగాణ నుంచే మోదీ పోటీ.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం అయ్యేందుకు ప్రధాని మోదీ తెలంగాణ నుంచి స్వయంగా లోక్‌సభకు పోటీ చేయాలని భావిస్తున్నట్లు ఢిల్లీ వర్గాల టాక్‌. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నేతృత్వంలో రాష్ట్రంలో ఇటీవలే జరిగిన సీక్రెట్‌ సర్వేలో సానుకూల అభిప్రాయాలే వచ్చాయని, త్వరలో సెకండ్‌ ఫేజ్‌ స్టడీ కూడా ఉండనున్నదని, ఆ తర్వాతే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలిసింది. దక్షిణాదికి వరాలు… దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై బీజేపీ దృష్టి పెట్టింది. ఈ క్రమంలో అభివృద్ధి కార్యక్రమాలను, ప్రాజెక్టులను, నిధులను మంజూరు చేస్తుంది. స్వయంగా ప్రధాని మోదీ చేతుల మీదుగా పలు డెవలప్‌మెంట్‌ యాక్టివిటీస్‌లు జరుగుతున్నాయి. గతంతో పోలిస్తే తమిళనాడులోనూ పార్టీ స్ట్రాంగ్‌ అవుతున్నదనే ధీమా వ్యక్తమవుతోంది. దక్షిణాదిలో కర్నాటక మినహా మరెక్కడా అధికారంలో లేని బీజేపీ తెలంగాణలో గెలిచి సౌత్‌ ఇండియాకు ‘గేట్‌ వే’గా మలుచుకోవాలనుకుంటోంది. ఇందుకోసం తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ నుంచి స్వయంగా ప్రధాని మోదీ పోటీ చేయడం ద్వారా అన్ని దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు గట్టి మెసేజ్‌ పంపడంతో పాటు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు దోహదపడుతుందన్నది కమలం వ్యూహంగా కనిపిస్తోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !