ఆంధ్రప్రదేశ్‌లో జగననన్న సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులకు సంబంధించి ఐదు జిల్లాలకు కో-ఆర్డినేటర్‌గా వైసీపీ నేత పుట్టా శివశంకర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారు పుట్టా శివశంకర్ రెడ్డి.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి అత్యంత విధేయుడు… పుట్టా శివశంకర్ రెడ్డి వివాద రహితుడు, పైగా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడు. పలు టీవీ డిబేట్స్‌లో పార్టీ వాయిస్‌ని బలంగా వినిపించే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు శివశంకర్ రెడ్డి. పార్టీ కోసం పనిచేసేవారికి పార్టీ పదవుల పంరగా తగిన గౌరవం అధినేత వైఎస్ జగన్ ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే పుట్టా శివశంకర్ రెడ్డికి ఐదు జిల్లాలకు సంబంధించి జగనన్న సచివాలయ కన్వీనర్లు, గృహసారధుల కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలు అప్పగించారు.