UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 వాల్తేర్‌ వీరయ్య ట్రైలర్‌ లాంచ్‌ డేట్‌, వేదిక ఫిక్స్‌

ఈసారి సంక్రాంతికి వస్తున్న పెద్ద సినిమాల్లో ఒకటి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్‌ వీరయ్య. ఈ మూవీ జనవరి 13న రిలీజ్‌ కాబోతోంది. సినిమా రిలీజ్‌కు ముందు చాలా గ్రాండ్‌గా మెగా మాస్‌ ఈవెంట్‌ నిర్వహించాలని మేకర్స్‌ భావిస్తున్నారు. దీనికోసం వైజాగ్‌లోని ఆర్కే బీచ్‌ను వేదికగా ఎంచుకున్నారు. అయితే వివిధ కారణాల వల్ల పోలీసులు దీనికి అనుమతి నిరాకరించారు. దీంతో తాజాగా మేకర్స్‌ మరో డేట్‌, వేదికను అనౌన్స్‌ చేశారు. ఈ మూవీ మెగా మాస్‌ ఈవెంట్‌ జనవరి 8న ఆంధ్రా యూనివర్సిటీలోని ఇంజినీరింగ్‌ గ్రౌండ్స్‌లో జరగనుంది. ఈ ఈవెంట్‌కు పెద్ద ఎత్తు మెగాభిమానులు తరలి వచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈవెంట్‌ నిర్వహించాల్సిందిగా పోలీసులు ఆర్గనైజర్లకు సూచించారు.

అయితే థియేట్రికల్‌ ట్రైలర్‌ను మాత్రం ఒక రోజు ముందుగానే అంటే శనివారం (జనవరి 7) రిలీజ్‌ చేయనున్నారు. ఈ అనౌన్స్‌మెంట్‌ కోసం ఓ కొత్త పోస్టర్‌ను కూడా మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. వాల్తేర్‌ వీరయ్య సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్‌ నటించిన విషయం తెలిసిందే. దేవీ శ్రీప్రసాద్‌ అందించిన ట్యూన్స్‌ ఇప్పటికే ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించాయి. ఈ సినిమా ఈ మధ్యే సెన్సార్‌ పనులు కూడా పూర్తి చేసుకుంది. దీనికి U/A సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఇక వాల్తేర్‌ వీరయ్య మూవీ నిడివి కూడా కాస్త ఎక్కువగానే ఉంది. ఈ సినిమా రన్‌టైమ్‌ 2 గంటల 40 నిమిషాలుగా తేల్చారు. కోన వెంకట్‌ అందించిన స్క్రీన్‌ ప్లే అంతసేపు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి. ఈ సినిమాలో మాస్‌ మహారాజా రవితేజ కూడా కీలకపాత్ర పోషించాడు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !