: ఇండియా లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరు సల్మాన్ ఖాన్..ఆయన సినిమా విడుదల అవుతుందంటే చాలు దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంటుంది..ఒక సినిమా హీరో గా సల్మాన్ ఖాన్ మీద ఎలాంటి కంప్లైంట్ లేదు..అతను ఒక గొప్ప నటుడు మరియు బిగ్గెస్ట్ సూపర్ స్టార్..కానీ ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం ఎల్లప్పుడూ వివాదాలతోనే నిండిపోయి ఉంటుంది..50 ఏళ్ళు దాటినా ఇప్పటికి ఆయన పెళ్లి చేసుకోలేదు. సంవత్సరానికి ఒక హీరోయిన్ తో డేటింగ్ చేస్తూ కాలం గడిపేస్తున్నాడు..అయితే ఒకప్పుడు ఈయనతో డేటింగ్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ షమీ అలీ సల్మాన్ ఖాన్ పై రీసెంట్ గా చాలా తీవ్రమైన ఆరోపణలను ఎదురుకుంటుంది..తాను తీసిన ‘ఫైట్ ఆర్ ఫ్లైట్’ అనే డాక్యుమెంటరీ ని సల్మాన్ ఖాన్ విడుదల కానివ్వడకుండా అడ్డుపడుతున్నాడని ఆమె మీడియా ముందుకి వచ్చి సంచలన ఆరోపణలు చేసింది.
అంతే కాకుండా గతంలో ఆమె సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన సమయంలో ఆమె ఎదుర్కున్న సంఘటనలు చెప్పుకుంటూ బాధపడింది..ఆమె మాట్లాడుతూ ‘సల్మాన్ ఖాన్ తో నేను డేటింగ్ లో ఉన్న సమయం లో నన్ను ఆయన ఎన్నో హింసలకు గురి చేసాడు.. ఇష్టమొచ్చినట్టు కొట్టేవాడు, సిగరెట్స్ తో కాల్చేవాడు.. అతను కొట్టే దెబ్బలకు నేను నెలల తరబడి మంచానికే పరిమితం అయ్యాను..ఆ సమయంలో సల్మాన్ ఖాన్ నన్ను కనీసం చూడడానికి కూడా రాలేదు..డాక్టర్లు నన్ను పరిశీలించినప్పుడు శారీరక వేధింపులకు గురి అయ్యావా అని అడిగారు.. ఆ స్థాయి లో సల్మాన్ ఖాన్ నన్ను కొట్టేవాడు.. అతని దెబ్బలు కనపడకుండా ఉండేందుకు నేను మేకప్ వేసుకునే దానిని..నాకు తగిలిన దెబ్బలను చూసి అతను ఎంతో ఆనందించే వాడు.. అతనొక్క పెద్ద శాడిస్ట్..సల్మాన్ ఖాన్ ఇప్పుడు తన న్యాయవాది ద్వారా ద్వేషపూరితమైన మెయిల్స్ పంపిస్తున్నాడు..బెదిరింపులు చేయిస్తున్నాడు’అంటూ షమీ అలీ సల్మాన్ ఖాన్ పై సంచలన ఆరోపణలు చేసింది.