UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 ‘వీర సింహా రెడ్డి’ మూవీ పై పోలీసుల ఓవర్ యాక్షన్.

నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘వీర సింహా రెడ్డి’ చిత్రం ఈ నెల 12 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే..అఖండ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్నా సినిమా కావడం తో ఈ మూవీ పై అభిమానుల్లోనే కాదు, ప్రేక్షకుల్లో కూడా అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి..దానికి తగట్టు గానే ఈ సినిమా నుండి వస్తున్న ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆకట్టుకుంటుంది. Balakrishna అందువల్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 70 కోట్ల రూపాయలకు పైగా జరిగింది..గతం లో బాలయ్య సినిమాలకు కనీసం 30 కోట్ల రూపాయిల బిజినెస్ కూడా జరిగేది కాదు..ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఒంగోలు లోని ABM కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహించాలి అనుకున్నారు..కానీ పోలీసులు అనుమతిని నిరాకరించడం తో అదే ఒంగోలు లో త్రోవగుంత సమీపం లోని BMR అర్జున్స్ ఇన్ఫ్రా కి మార్చారు.

Balakrishna అయితే వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి పోలీసుల ఓవర్ యాక్షన్ మామూలుగా లేదని అభిమానులు మండిపడుతున్నారు..గురువారం వరకు కూడా ఈ సినిమాకి అనుమతి ఇచ్చే విషయం లో పోలీసులు ఎన్నో ఆంక్షలు పెడుతూ వచ్చారట..పోలీసులు ఈవెంట్ మ్యానేజర్లు నుండి అభిమానులకు నిన్న రాత్రి 10 గంటల వరకు పాస్ లు కూడా ఇవ్వలేదట..వాటిపై ముద్రలు వేయాలంటూ పోలీసులు స్వాధీనపరుచుకున్నారట..అంతే కాకుండా అభిమానులు అక్కడకి వచ్చిన సెలబ్రిటీస్ తో ఫోటోలు దిగకూడదని..దిగితే కఠినమైన చర్యలు తీసుకుంటాము అంటూ ఈవెంట్ మ్యానేజర్స్ కి వార్నింగ్ ఇచ్చారట. Balakrishna తెలంగాణాలో ఇలాంటి ఆంక్షలు ఏమి ఉండవని..అక్కడి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని..కానీ ఇక్కడ మాత్రం రాజకీయాలు తప్పట్లేదంటూ అభిమానులు వాపోతున్నారు..పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆంధ్ర ప్రదేశ్ లో ఇక భవిష్యత్తులో ఎవ్వరూ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చెయ్యరని,షూటింగ్స్ చెయ్యడానికి కూడా ఆసక్తి చూపించరూ అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !