బాలీవుడ్ లో ఆల్ట్రా మోడ్రన్ లైఫ్ స్టైల్ ఉంటుంది. దాదాపు పాశ్చాత్యులను తలపిస్తుంది. ఎఫైర్స్ అనేవి సర్వసాధారణం. ఒక్కో హీరో కెరీర్లో కనీసం ముగ్గురు నలుగురు హీరోయిన్స్ తో ఎఫైర్స్ నడిపి ఉంటాడు. ఈ లిస్ట్ లో రన్బీర్ కపూర్, సల్మాన్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నారు. వీరిద్దరూ అధికారికంగానే అరడజనుకు పైగా హీరోయిన్స్ తో డేటింగ్ చేశారు. ఒకరేంటి దాదాపు అందరూ హీరోలు ఈ ఆరోపణలు ఎదుర్కొన్నవారే. అలాగే కొన్ని విచిత్రమైన, ఊహకు అందని ప్రేమ బంధాలు ఉంటాయి. అర్జున్ కపూర్-మలైకా అరోరా ఎఫైర్ అలాంటిదే. 37 ఏళ్ల అర్జున్ కపూర్ 49 ఏళ్ల మలైకా అరోరాతో డేటింగ్ చేస్తున్నాడు. ఆమెకు 20 ఏళ్ల కొడుకు ఉన్నాడు. Aryan Khan- Nora Fatehi మలైకా-రన్బీర్ వివాహం చేసుకుంటారనే ప్రచారం కూడా జరుగుతోంది. అదే జరిగితే అరుదైన వివాహ బంధం అవుతుంది. కాగా మరో కొత్త ఎఫైర్ వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఎఫైర్ రూమర్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్ నోరా ఫతేహితో అతడు డేటింగ్ చేస్తున్నాడనేది తాజా న్యూస్. వీరిద్దరూ న్యూ ఇయర్ వేడుకలు జంటగా దుబాయ్ లో జరుపుకున్నారట.
ఆర్యన్-నోరా ల కొన్ని ప్రైవేట్ ఫోటోలు బయటకు రావడంతో ఎఫైర్ నిజమే అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. కెనడాకు చెందిన నోరా ఫతేహి ప్రొఫెషనల్ డాన్సర్ అండ్ సింగర్ కూడా. ప్రస్తుతం ఆమె మోడల్ గా, నటిగా కొనసాగుతున్నారు. తెలుగులో టెంపర్, బాహుబలి 1, షేర్. లోఫర్ చిత్రాల్లో ఐటెం నంబర్స్ చేశారు. చిత్రీకరణ దశలో ఉన్న హరి హర వీరమల్లు మూవీలో నోరా ఫతేహి కీలక రోల్ చేస్తున్నారు. నిధి అగర్వాల్ ఒక హీరోయిన్ గా నటిస్తుండగా నోరా ఫతేహి మరొక హీరోయిన్ అంటున్నారు. హరి హర వీరమల్లు మూవీలో నోరా ఫతేహి రోల్ పై స్పష్టమైన సమాచారం లేదు. Aryan Khan- Nora Fatehi ఇక ఆర్యన్ ఖాన్ ఏజ్ 25 కాగా నోరా ఫతేహికి 30 ఏళ్ళు. ఆర్య కంటే ఆమె ఐదేళ్లు పెద్దది. త్వరలో ఆర్యన్ ఖాన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. హీరో కాకుండానే ఆర్యన్ ఖాన్ ఎఫైర్స్ స్టార్ట్ చేశారు. గతంలో కూడా ఆర్యన్ ఖాన్ పై ఎఫైర్ రూమర్స్ వినిపించాయి. 2021 అక్టోబర్ లో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగించాడంటూ ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశాడు. దాదాపు నెల రోజులు జైలు జీవితం గడిపిన ఆర్యన్ కి ముంబై హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.