UPDATES  

 ఆస్కార్ జాబితాలో ఎన్టీఆర్. హాలీవుడ్ స్టార్స్ సరసన చేరిన యంగ్ టైగర్!

ప్రపంచ సినిమా వేదికపై ఆస్కార్ ని ముద్దాడటం ప్రతి నటుడి కల. అయితే ఇండియన్స్ కల్లో కూడా ఆస్కార్ వస్తుందని ఊహించరు. అలా అని భారతీయ చిత్రాలకు ఆ సత్తా లేదా అంటే ఉంది. ఆర్ట్ సినిమాలకు ఆస్కార్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఇండియాలో ఆ తరహా చిత్రాలు తక్కువ మొత్తంలో తెరకెక్కుతున్నాయి.అకాడమీ అవార్డ్స్ జ్యూరీ మెంబర్స్ లో భారతీయ చిత్రాల పట్ల ఉండే వివక్ష కూడా ఒక కారణం. కే విశ్వనాథ్ తెరకెక్కించిన కళాఖండాలు ఆస్కార్ అర్హతకు మించినవి. ఇక వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో 5గురు మాత్రమే ఆస్కార్ ముద్దాడారు. NTR Oscar కాస్ట్యూమ్స్ డిజైనర్ భాను అథియా ఆస్కార్ అందుకున్న మొదటి ఇండియన్.

1982లో ఆమెను ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. అనంతరం బెంగాలీ ఫిలిం మేకర్ సత్య జిత్ రే కు 1992లో గౌరవ ఆస్కార్ ఇచ్చారు. తర్వాత ఏ ఆర్ రెహమాన్, గుల్జార్, రసూల్ పూకుట్టి స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి ఆస్కార్ అవార్డ్స్ గెలుపొందారు. 2009 తర్వాత మళ్ళీ ఇండియాకు ఆస్కార్ రాలేదు. NTR Oscar ఆర్ ఆర్ ఆర్ మూవీ సంచలన విజయం సాధించగా ఈ చిత్రానికి ఆ అర్హత ఉందని మేకర్స్ తో పాటు ఇండియన్ ఆడియన్స్ భావిస్తున్నారు. అయితే అధికారికంగా ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ జ్యూరీ సభ్యులు ఆర్ ఆర్ ఆర్ ని ఆస్కార్ నామినేషన్స్ కి పంపలేదు. అయినప్పటికీ లాస్ ఏంజెల్స్ లో రెండు వారాలకు పైగా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఆర్ ఆర్ ఆర్ ప్రదర్శించబడింది. ఆ విధంగా జనరల్ కేటగిరీలో ఆస్కార్ అవార్డ్ కి అప్లై చేసుకునే అవకాశం దక్కింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !