UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల..

గత ఏడాది ఇండస్ట్రీ కి పరిచయమైనా కొత్త హీరోయిన్స్ లో యూత్ మరియు మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న హీరోయిన్ శ్రీ లీల..శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరో గా తెరకెక్కిన పెళ్లి సందడి అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా శ్రీలీల, తొలి సినిమాతోనే తన అందం, డ్యాన్స్ మరియు నటనతో లక్షలాది మంది అభిమానుల మనసుల్ని దోచుకుంది. ఇండస్ట్రీ లో కూడా ఈమెపై పెద్ద పెద్ద డైరెక్టర్స్ మరియు నిర్మాతల కన్ను పడింది..ఆమె డేట్స్ కోసం ఇంటి చుట్టూ తిరుగుతున్నారు..రీసెంట్ గానే ఆమె హీరోయిన్ గా నటించిన ‘ధమాకా’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది..దానితో ఈ అమ్మడుకి క్రేజ్ మరింత పెరిగింది..ఈ సినిమా తర్వాత ఆమె పంజా వైష్ణవ్ తేజ్ తో ఒక సినిమా చేస్తుంది..దీనితో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా సెకండ్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది.

అయితే శ్రీలీల కి ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సుజీత్ కాంబినేషన్ లో #OG అనే సినిమా అతి త్వరలోనే సెట్స్ మీదకి వెళ్ళబోతున్న సంగతి తెలిసిందే..ఇందులో హీరోయిన్ రోల్ శ్రీలీల కి వచ్చిందట..అందుకోసం ఆమెకి భారీ మొత్తం లో పారితోషికం కూడా ఇచ్చాడదట నిర్మాత డీవీవీ దానయ్య..సుమారుగా 3 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు ఫిలిం నగర్ లో వినిపిస్తున్న వార్త. ఈ సినిమా హిట్ అయితే శ్రీలీల ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు..ఎందుకంటే పవర్ స్టార్ తో సినిమా అంటే మామూలు విషయం కాదు..అన్నీ కుదిరితే ఆమె ఏకంగా నెంబర్ 1 హీరోయిన్ స్పాట్ లో కూర్చుంటుంది..కేవలం ఈమె కోసమే సినిమాకి వచ్చే ఆడియన్స్ చాలా మంది ఉంటారు కాబట్టి కచ్చితంగా శ్రీలీల ఉండడం వల్ల #OG కి మరింత కలర్ యాడ్ అయ్యినట్టు ఉంటుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !