UPDATES  

NEWS

ఉపాధి హామీ కూలీలకు దినసరి వేతనం రూ,,272 వచ్చెల చూడాలి…. పని చేసే ప్రభుత్వాన్ని గెలిపించండి… కాంగ్రెస్ మండల ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లి కొండ యాదగిరి… వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్ సేవలు వెలకట్టలేనివి… శీతల చలివేంద్రం ప్రారంభించిన జాతీయ మిర్చి బోర్డు డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి… శ్రీ నాగులమ్మ కు ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా పూజారుల పూజలు..గండోర్రే గుట్ట వద్ద వనదేవతకు ప్రత్యేక పూజలు.. ‘పరిష్కారమెప్పుడూ యుద్ధరంగంలో లభించదు’.. తాజ్‌మహల్‌పై పిటిషన్.. విచారణకు స్వీకరించిన కోర్టు.. పవన్ కల్యాణ్ ప్రచారానికి అనసూయ. హీరో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్..! ఓటీటీలోకి సుందరం మాస్టర్.. పుష్ప నుంచి మరో క్రేజీ అప్‌డేట్..

 లేడీ వారియర్ గా దీపికా పదుకొనె

ఒక్కో అప్డేట్ ప్రాజెక్ట్ కే మూవీపై అంచనాలు పెంచేస్తుంది. న్యూ ఇయర్ సందర్భంగా ఓ మేకింగ్ వీడియో విడుదల చేశారు. సదరు వీడియోలో ఒక టైర్ ని రూపొందించడం కోసం రోజుల తరబడి పని చేశారు. ఆ టైర్ డిజైన్ చేయడానికి ప్రత్యేక బృందం పని చేసింది. ప్రాజెక్ట్ కే మూవీలో వాడే వాహనాలు, వస్తువులు, ఆయుధాలు స్కార్ఫ్ లో తయారు చేయాలని దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు. స్కార్ఫ్ విజువల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ సాంకేతికతను ప్రాజెక్ట్ కే షూటింగ్ కోసం వాడుతున్నారు. Deepika కాగా ప్రాజెక్ట్ కే మూవీలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. నేడు దీపికా పదుకొనె బర్త్ డే. ఈ సందర్భంగా ఆమె ప్రీ లుక్ విడుదల చేశారు. హాలీవుడ్ మూవీస్ లో కనిపించే లేడీ వారియర్ ని దీపికా తలపిస్తున్నారు. ప్రీ లుక్ చూశాక ఆమె పూర్తి గెటప్ చూడాలన్న ఆసక్తి పెరిగిపోయింది. సదరు పోస్టర్ లో ‘హోప్ ఇన్ ది డార్క్’ అని కోట్ రాశారు.

ఆశలు వదులుకున్న వేళ చివరి ఆశ అని దానర్థం. ఈ ఒక్క కోట్ చాలు ప్రాజెక్ట్ కే మూవీలో దీపికా రోల్ ఎంత కీలకమో చెప్పడానికి. Deepika ప్రాజెక్ట్ కే కథను మలుపు తిప్పే బలమైన పాత్ర ఆమె చేస్తూ ఉండవచ్చు. గ్లాడియేటర్, ట్రాయ్ వంటి ఆల్ టైం హాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాలను దీపికా ప్రీ లుక్ తలపించింది. హీరోయిన్ దీపికా లుక్ నే ఇలా ఉంటే… ఇక ప్రభాస్ లుక్ అంచనాకు కూడా అందడం లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్న దానికి పది రెట్ల హై దర్శకుడు నాగ్ అశ్విన్ ఇస్తాడనిపిస్తుంది. Also Read: RRR’s biggest success: ఆర్ ఆర్ ఆర్ ఖాతాలో అతిపెద్ద విజయం. ప్రతిష్టాత్మక న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు అందుకున్న రాజమౌళి దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో ప్రాజెక్ట్ కే తెరకెక్కుతుంది. ఇది పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ మూవీ అని నాగ్ అశ్విన్ ఇప్పటికే చెప్పారు. తన మాటల్లోని విశ్వాసం పోస్టర్స్ లో కనిపిస్తుంది. సైన్స్ ఫిక్షన్ జోనర్లో ప్రాజెక్ట్ కే తెరకెక్కిస్తున్నారు. మూవీ టైం ట్రావెల్ స్టోరీ అనే ప్రచారం కూడా జరుగుతోంది. దిశా పటాని మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. బిగ్ బి అమితాబ్ కీలక రోల్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ కే 2024లో విడుదలయ్యే అవకాశం కలదు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !