మన్యం న్యూస్. ములకలపల్లి. జనవరి 07
.ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద న్యాయ,విజ్ఞాన సదస్సుని శనివారం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రజలు ప్రభుత్వాలు చేసే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల తో పాటు,ప్రభుత్వ చట్టాలకు లోబడి ప్రజలు తమ జీవన విధానాన్ని కొనసాగించాలని సూచించారు. మండలం లోని గిరిజన గ్రామాలు ఉండటం వల్ల,పరిసర గ్రామాల్లో బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఇది నిరోధించేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని పోలీసులను సూచించారు.ఈ సదస్సులో మండలానికి చెందిన సర్పంచులు కారం సుధీర్, వాడే నాగరాజు మండల కేంద్రం లోని గ్రామ పెద్దలు పువ్వాల మంగపతి, మోరంపూడి అప్పారావు, మేకల వెంకన్న, పుష్పాల చందర్రావు, కొండవీటి రాజారావు, కరుటూరి కృష్ణ, శనగపాటి సీతారాములు, బండి కొమురయ్య, శనగపాటి అంజి, తదితరులు పాల్గొన్నారు.