UPDATES  

 సర్పంచ్ దీక్షతో సాధించిన వెలుగులు ఫలించిన ఆదివాసీ సర్పంచ్ నిరాహారదీక్ష

తిమ్మాపురం, గ్రామాలకి విద్యుత్ వెలుగులు, గృహాలకి విద్యుత్ మీటర్ల
ఎంఎల్ఏ మెచ్చాకు కృతజ్ఞతలు తెలిపిన సర్పంచ్ ప్రసాద్

మన్యంన్యూస్, అశ్వారావుపేట, జనవరి 07… ఆ ఊరు కోసం పట్టు వదలని విక్రమార్కుడు అయ్యాడు . ఏళ్ల తరబడి అంధకారంలో చిక్కుకున్న గ్రామాలకు వెలుగులు పెంచాలని స్వయంగా తానే దీక్ష బునాడు. ఎవరు చెప్పినా వినలేదు. ఆ గ్రామాలకు వెలుగులు వచ్చేంతవరకు తాను అక్కడ నుంచి వెళ్ళేది లేదంటూ ఓ గ్రామ సర్పంచ్ దీక్షలతో సాధించుకున్న విజయం ఇది. ఇంకేముంది ఆ గ్రామాలకు వెలుగులు వచ్చాయి సర్పంచ్ పంతం వీడాడు. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలోని అశ్వరావుపేట మండల పరిదిలోని తిమ్మాపురం గ్రామం, గంగారం గ్రామాలకి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి విద్యుత్తు లేదు మౌలిక వసతులు లేవు అటువంటి సమయంలో నూతంగాగా ఏర్పడ్డ వేదాంతపురం గ్రామ పంచాయితీ మొదటి సర్పంచ్ సోమిని శివ ప్రసాద్ ని కలిసి ఆ గ్రామ ప్రజలు మౌలిక వసతులు కావాలి అని అడిగారు. అప్పటి నుంచి వేదాంతపురం సర్పంచ్ శివశంకర్ ప్రసాద్ తిమ్మాపురం, గంగారం గ్రామ సమస్యలని భుజాన వేసుకుని దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి జిల్లా ప్రజాప్రతినిధులను, జిల్లా స్థాయి అధికారులను కలుస్తూ సమస్యని వివరిస్తూ వచ్చాడు. ఆ క్రమంలో ఐటీడిఏ నందు గ్రామ ప్రజలతో ధర్నా కార్యక్రమం నిర్వహించి ఐటిడిఏ పిఓ పొట్రూ గౌతమ్ అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో హార్షం వ్యక్తం చేసారు. కానీ సమస్య తీరలేదు. ఇక ఈ సమస్య ఏ అధికారికి పట్టించుకోవడం లేదని తిమ్మాపురం గ్రామంలో స్వయంగా సర్పంచ్ నిరాహారదీక్ష కు పూనుకున్నారు. ఆ దీక్ష సమయంలో ఎంఎల్ఏ మెచ్చా నాగేశ్వరావు హామీ ఇచ్చారు. ఆ గ్రామానికి విద్యుత్ సౌకర్యం, త్రాగునీరు కల్పిస్తామని హామీ ఇస్తూ అధికారులను నిరాహారదీక్ష శిభిరం వద్దకు పంపడం జరిగింది. అక్కడికి వచ్చిన జిల్లాఅధికారి ఐటిడిఏ మండల తాహాసీల్దార్ వచ్చి తిమ్మాపురం గ్రామం పూర్తిగా అటవీ ప్రాంతలో ఉన్నది కావున అటవీ శాఖ వారి కి ప్రజా అవసరం నిమిత్తం కొంత భూమిని రెవిన్యూ కి బదిలీ చేసి వసతులు కల్పిస్తాం అని చెప్పడం జరిగింది. ఎంఎల్ఏ మెచ్చా చెప్పిన మాట ప్రకారం తిమ్మాపురం, కొత్త గంగారమ్ గ్రామాలకు కరెంటు వచ్చింది. ప్రస్తుతం ప్రతి ఇంటికి కరెంటు సౌకర్యం కల్పించి మీటర్లు వేయించడం జరుగుతుంది, శనివారం విద్యుత్ అధికారులు సర్పంచ్ అద్వర్యంలో గ్రామంలో పర్యటించి విద్యుత్ మీటర్లు ఏర్పాటుకు పరిశీలించారు. ఈ సందర్భంగా వేదాంతపురం సర్పంచ్ సోమిని శివశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ ఆ రెండు గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించిన ఎంఎల్ఏ మెచ్చా నాగేశ్వరావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఆ గ్రామాల ప్రజలు విద్యుత్ కాంతుల్లో జీవించబోతున్నందుకు సంతోషం వ్యక్త పరుస్తూ ఇంత కృషి చేసి గ్రామాలకి విద్యుత్ సౌకర్యం కల్పించే క్రమంలో ప్రజల కోసం పోరాడిన సర్పంచ్ శివశంకర్ ప్రసాద్ అంటూ పొగడ్తలతో సర్పంచును అభినిందించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !