UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 గోత్తి కోయ గ్రామాన్ని సందర్శించిన జిల్లా మలేరియా అధికారి వెంకటేశ్వర్లు..

 

మన్యం న్యూస్ దుమ్ముగూడెం నవంబర్ 07
మండలంలోని గద్దమడుగు వలస గుత్తి కోయ గ్రామాన్ని జిల్లా మలేరియా అధికారి గొంది వెంకటేశ్వర్లు శనివారం నాడు సందర్శించారు. ఇటీవల కాలంలో గద్దమడుగు గ్రామంలో ఒక మలేరియా పాజిటివ్ కేసు మడకం జోగమ్మకు  నిర్ధారణ కావడంతో వైద్య బృందం ఆ గ్రామానికి వెళ్లారు. సుమారు మూడు కిలోమీటర్లు కాలినడకనగా వెళ్లిన వైద్య బృందం గ్రామస్తులతో మలేరియా పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు.ఈ సందర్భంగా మలేరియా అధికారి మాట్లాడుతూ అందరూ కూడా దోమతెరలు వాడాలని ఇంటి చుట్టూ నీటి నిలువలు ఉండకుండా చూసుకోవాలని సూచించారు. జ్వరం ఉన్న ప్రతి ఒక్కరూ దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించాలని తెలియజేశారు. మలేరియా పాజిటివ్ వచ్చిన కుటుంబ సభ్యులకు రక్త పరీక్షలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా కోఆర్డినేటర్ పోలెబోయిన కృష్ణయ్య, పర్యవేక్షకులు రామకృష్ణ, హెల్త్ అసిస్టెంట్ నరసింహారావు, ఆశాలు ఉమా, సుభద్ర, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !