మన్యంన్యూస్, మణుగూరు, జనవరి 07: సింగరేణి పాఠశాలలు ఉన్నత ప్రమాణాల విద్యకు నిలయాలని జిఎం ఎడ్యుకేషన్ సెక్రటరీ వెంకటేశ్వరరావు అన్నారు. ఆయన శనివారం మణుగూరు ఏరియా పివి కాలనీ సింగరేణి పాఠశాల 45వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సకల సౌకర్యాలు,ఉన్నతమైన విద్యతోపాటు వైజ్ఞానిక సృజనాత్మకతను కూడా బోధిస్తుందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, అంకితభావంతో చదువుతూ ఉత్తీర్ణత సాధించి ఉపాధ్యాయులకు, చదువుకున్న పాఠశాలకు పేరు ప్రతిష్టలు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జిఎం నాగేశ్వరరావు, పర్సనల్ మేనేజర్ రమేష్, హెచ్ఎం స్వరూపారాణి, కళ్యాణి, అనురాధ, కృష్ణ బాబు తదితరులు పాల్గొన్నారు.