వైరా సీటు మనదే..
ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాములు నాయక్..
ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపు..
మన్యం న్యూస్ : జూలూరుపాడు, జనవరి 07.., తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రానున్న ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయిస్తామని ప్రకటించారని, కాబట్టి రానున్న ఎన్నికల్లో వైరా సీటు మనదే నని, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో తెలిపారు. శనివారం జూలూరుపాడు మండల కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలన్నీ గ్రామాలలో ప్రజలకు తెలియజేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వర్గ విభేదాలకు అతీతంగా అందరినీ సమన్వయం చేసుకుంటూ బిఆర్ఎస్ పార్టీని వైరా నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల పనిచేయాలని కోరారు. బిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త శక్తి వంచన లేకుండా కృషి చేయాలని, రాబోయే ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సోనీ, జడ్పిటిసి కళావతి, సొసైటీ చైర్మన్ వెంకటరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు సతీష్ కుమార్, ప్రధాన కార్యదర్శి రంగారావు, సీనియర్ నాయకులు ఎల్లంకి సత్యనారాయణ, వేల్పుల నరసింహారావు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.