మన్యం న్యూస్ దుమ్ముగూడెం నవంబర్ 07
మండలంలోని గద్దమడుగు వలస గుత్తి కోయ గ్రామాన్ని జిల్లా మలేరియా అధికారి గొంది వెంకటేశ్వర్లు శనివారం నాడు సందర్శించారు. ఇటీవల కాలంలో గద్దమడుగు గ్రామంలో ఒక మలేరియా పాజిటివ్ కేసు మడకం జోగమ్మకు నిర్ధారణ కావడంతో వైద్య బృందం ఆ గ్రామానికి వెళ్లారు. సుమారు మూడు కిలోమీటర్లు కాలినడకనగా వెళ్లిన వైద్య బృందం గ్రామస్తులతో మలేరియా పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు.ఈ సందర్భంగా మలేరియా అధికారి మాట్లాడుతూ అందరూ కూడా దోమతెరలు వాడాలని ఇంటి చుట్టూ నీటి నిలువలు ఉండకుండా చూసుకోవాలని సూచించారు. జ్వరం ఉన్న ప్రతి ఒక్కరూ దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించాలని తెలియజేశారు. మలేరియా పాజిటివ్ వచ్చిన కుటుంబ సభ్యులకు రక్త పరీక్షలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా కోఆర్డినేటర్ పోలెబోయిన కృష్ణయ్య, పర్యవేక్షకులు రామకృష్ణ, హెల్త్ అసిస్టెంట్ నరసింహారావు, ఆశాలు ఉమా, సుభద్ర, తదితరులు పాల్గొన్నారు.